పుట:AndhraRachaitaluVol1.djvu/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవివాడిన శబ్దములు చూచి అవి లక్ష్యముగాచేసికొని లక్షణము చెప్పవలసినవాడు లక్ష్యము తప్పనడమునకు అధికారము కలవాడుకాడు. లక్షణములో అనేకదోషము లుండవచ్చును. చెప్పవలసిదంతా చెప్పకపోవడము ఒకదోషము. చెప్పకూడనిది చెప్పడము ఒకటి...

'బాలకవి శరణ్యపీఠిక.'


ప్రాచీనకవుల కావ్యములు శ్రద్ధగాజదివి కోశాకారులు లాక్షణికులు తప్పులని త్రోసివైచిన యనేక ప్రయోగములు వానిలోనుండి యేరి యవి వ్యాకరించిరి. అదియే 'బాలకవిశరణ్యము' నన్న యాదులకు గూడ గ్రామ్యము వాడక తప్పలేదని వీరు ఘంటాపథముగా జెప్పిరి. నోటిమాటయు జేతివ్రాతయు నొకరీతిగా నుండవలెననియు, గ్రంథములలో నున్న సలక్షణభాష పరమప్రాచీనమై యందఱకు నందుపాటులో లేదనియు గనుక నదివీడి వ్యవహారభాషలో గ్రంథరచనకావింపవలెనని వీరి నాదసారము. ఈవాదము బాగుగ నున్నదని నేటి పత్రికారచయితలు, నవకవులు, ఆంగ్లవిద్యాధికులు నెందఱో యాదారిని బోవుచున్నారు. ప్రాచ్యభాషాపండితులతో గూడ నీపద్ధతి నంగీకరించిన వారు కలరు.


పక్షపాతములు వీడి తటస్థులమై రామమూర్తిపంతులు గారినిగూర్చి ముచ్చటించుకొనినచో నాయన గొప్ప వాజ్మయవేత్త. గొప్ప స్థిర సంకల్పుడు. గొప్పవిమర్శకుడు. గొప్పప్రయోగవిజ్ఞడు. అన్ని శక్తులను మించినది వీరిలో జ్ఞాపకశక్తి. భారతము పదునెనిమిది పర్వములను వీరి హృదయఫలకమున నున్నవి.నాయనా, సీతాపతీ! శాంతిపర్వము-----సములో 'వేదుఱు' అన్న ప్రయోగము 17 వ పద్య

(ఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)