పుట:AndhraRachaitaluVol1.djvu/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దృడనిశ్చయము, కార్యదీక్ష, స్వతంత్రోద్దేశము, అహోరాత్ర పర్శ్రమము ఇవన్నియు గూడి 'రామమూర్తి' రూపముదాల్చినవి. ఈయననవకవులను వెనుకనుంచుకొని గ్రాంథికపండితులమీది కురికి శంఖనాదము చేసినారు. రామమూర్తి పంతులుగారి బధిరము వారివాదమునకు బెద్ద సాహాయ్య మొనరించినది. పంతులుగారు గంటలకొలది గంగాప్రవాహమువోలె భాషింపగల వాగ్మి. ప్రతిపక్షు లెంతగోల పెట్టుచున్నను వారికి వినబడదు. వారిధోరణి వారిదే. ఈయన తనకువచ్చిన యుత్తరములుగూడ గంఠస్థము చేసికొనెడివారు. ప్రత్యుత్తరముల నకళ్లుకూడ భద్రపఱిచెడివారు. ఈయననుగూర్చి మిత్రులొక రిట్లు వ్రాసిరి. "ఇతనిపండ్ల పటపటయందు వాడియైనతర్క మున్నది. ఈతని తీక్ష్ణదృక్కులందు మిఱుమిట్లు గొలుపు సారస్వత మున్నది. ఈతని బల్లెంపుటుక్తులయందు కోసైన మీ మాంస యున్నది. ఈతని పిడికిలి యందు బలమైన యాత్మవిశ్వాస మున్నది."


రామమూర్తి పంతులుగారికి గల తెలుగు బాస తెలివిడికి వారి 'ప్రాదెమగు గమ్మ' మేలిమచ్చు. ఈకమ్మ సలక్షణాంధ్రభాషపై క్త్తిగట్టి పోరినది. అచ్చతెనుగు కావ్యములు వ్రాసిన మహాకవులకు సైతము నిట్టిధారయు, భాషాజ్ఞానము నలవడలేదని దీనిని చూచిన దెలియగలదు.


పంతులుగారు గురుజాడ అప్పారావుగారి సహపాఠముతో 'మెట్రిక్యులేషన్‌' పరీక్ష దేలిరి. అప్పటికంతతో జదువుచాలించి యాఱునెలలు 'కలక్టరుకచేరీ' లో గుమస్తాపని చేసిరి. 1880 లో పర్లాకిమిడి పాఠశాలలో బ్రవేశించిరి. అక్కడ పనిచేయుచునే ఎఫ్.ఏ.లో నెగ్గిరి. 1892 లో నవరభాషనుగూర్చి తెలిసికొనదలచి గొప్ప కృషి చేసిరి. ముఖలింగదేవాలయము మీది శిలాశాసనలిపి చదువదొడగిరి. నవరభాషలోగల పాటలు సేకరించుటకును, తద్భాషాతత్త్వ మెఱుగు