పుట:AndhraRachaitaluVol1.djvu/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాలనున్నవి. ప్రహసననిర్మాతలలో పంతులుగారే ప్రథములు."ఆచారము" అను ప్రహసనములో చేదస్తపు చెలమమ్మమాటలు కొన్నిమచ్చు:

"నీవు అదృష్టవంతురాలవు గనుక నొక్కమోస్తరుగా ఆచారం జరుపుకుంటున్నావు. నాకు నీలాగుజరుగదు అక్కడికి నేను రోజుకు రెండు వందలస్నానాలు చేస్తాను. ఈవేళ మట్టుకు ఇప్పటికి పదిస్నానాలు చేసినాను. తెల్లవారిలేచి దొడ్లోకివెళ్ళినప్పుడు కాలికింద యేమో మెత్తగా తగిలి అది యేమిగుడ్డో అని తలనిండా స్నానముచేసినాను. తరువాత మాకోడలు దగ్గరనుంచి వెళ్ళినప్పుడు పైట కొంగు తగిలినట్టు అనుమానం కలిగి మళ్ళీస్నానము చేసినాను. గోదావరికి వెళ్ళి స్నానముచేసి బిందె ఎత్తుకొని వస్తూ బట్టలు వుతుక్కునే వాళ్ళ నీళ్ళుపడ్డట్టుతోచి మళ్ళీవెళ్ళి ములిగినాను. తీరా వడ్డుకు వచ్చేటప్పుడు నీళ్ళలో కాలికేదో ఆకుతగిలి అంటతప్పెళాలు తోమెవాళ్ళు వేసిన అంటాకని నీళ్ళుపారపోసి వెళ్ళి మళ్ళీ స్నానం చేసినాను. తరువాత బిందెత్తుకొని సఘం దూరం వచ్చేటప్పటికి ఇరవైగజాల దూరంలో మాలవాడు కనబడి నీళ్ళు నడి వీధిలో పారపోసి వాణ్ణినాలుగు తిట్టి వాడిజివానికి ఉసూరుమంటూ మళ్ళీ వెనుకకు గోదావరికి వెళ్ళి స్నానముచేసి నీళ్ళు తెచ్చుకున్నాను......ఎన్నిస్నానాలయినవో లెక్క పెట్టినావా" ఈయన మొత్తము--ప్రహసనములు కూర్చిరి. అందు పదునాల్గు పెద్దవి. వీరి ప్రహసనభాష సొగసుగానేయుండును. స్వాభావికత కొంతతక్కువ.

వీరు"తర్కసంగ్రహము" నకు జక్కని తెనుగు వ్రాసిరి.జ్యోతిశ్శాస్త్రము--శారీరశాస్త్రము ననువదించిరి. ఆంగ్లేయభాషలో నుండు భౌతికశాస్త్రము లాంధ్రీకరించుత్రోవ పంతులుగారే చూపిరనవచ్చును.

జీవితచరిత్రరచనమునకు దెలుగున సూత్రము వేసినవారు వీరేశలింగము పంతులుగారే. వేమభూపాలీయ రఘునాధాభ్యుదయాదులు సంస్కృతములో వెలసినవి. దానిలో గవితకున్నంత ప్రాధాన్యము చరిత్ర