పుట:Andhra-Bhashabhushanamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii


"శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజివరప్రసాదకవితాది విలాసవేదశాస్త్రపురాణేతిహాసకళావినోదమానస... ఖ్యాత కేతనామాత్యప్రణీతంబైన యాంధ్రభాషాభూషణం బనుశబ్దశాస్త్రంబునందు నేకాశ్వాసము" అని కలదు. దీనినిబట్టి కేతనకవికిఁ దిక్కనసోమయాజి కవితాగురువని తేలుచున్నది. కేతన తిక్కనసోమయాజికంటెఁ జిన్నవాఁడని యూహింపవచ్చును.

కేతనకవి, దశకుమారచరిత్రము, విజ్ఞానేశ్వరము (ఇది యాజ్ఞవల్క్యస్మృతికిఁదెలుఁగు. ఐదు యాజ్ఞవల్క్యస్మృతికి వ్యాఖ్యయగు విజ్ఞానేశ్వరీయములోని విశేషవిషయములుగూడ నాంధ్రీకరింపఁబడినవి. కావుననే యా నామకరణము చేయఁబడియుండును) ఆంధ్రభాషాభూషణమును రచించెను. కాదంబరి పద్యకావ్య మాతఁడు రచించినదగునో కాదో సందేహము. ఇతరోదాహృత పద్యములనుబట్టి యూహించిన యూహలేగానిగ్రంథ మింతవఱకు లభింపలేదు. వానిలోఁ బ్రకృతమగు నాంధ్రభాషాభూషణము తెనుఁగువ్యాకరణములలో మొట్టమొదటిదని ఈక్రింద నుదాహరించిన యాంధ్రభాషాభూషణపద్యములు తెలుపుచున్నవి.

క. "మున్ను తెనుఁగునకు లక్షణ
   మెన్నఁడు నెవ్వరును జెప్పరేఁ జెప్పెద వి