పుట:Andhra-Bhashabhushanamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ix


     ద్వన్నికరము మదిమెచ్చఁగ
     నన్నయభట్టాదికవిజనంబులకరుణన్. 6

తే. సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పి
    తెనుఁగునకు లక్షణముఁ జెప్పకునికియెల్లఁ
    గవిజనంబులనేరమిగాదు నన్ను
    ధన్యుఁ గావింపఁదలఁచిన తలఁపుగాని." 7

ఈతఁడు వ్యాకరణము క్రొత్త రచింపబూనుటయా యని యధిక్షేపించుచు మూతివిఱుచుకొన్నవారు కొంద ఱాతనికాలమున నుండిరి. కావుననే యట్టివారి కాతఁ డొకమ్రొక్కు మ్రొక్కినాఁడు.

ఉ. "క్రొత్తగ నాంధ్రభాషకును గొండొకలక్షణ మిట్లుచెప్పెనే
    యుత్తమబుద్ధి వీఁడయని యోరలువోవక విన్న మేలు మీ
    రొత్తిన మీకుమాఱు కొని యుత్తరమిచ్చుట చాలవ్రేఁగుమీ
    చిత్తమునందు నన్నెరవుసేయకుఁడీ కవులార మ్రొక్కెదన్."

ఇందు "నన్నురవసేయకుఁడీ" అనిపాఠాంతరము గలదు. పైపద్యములలో మున్నెవ్వరును దెనుఁగునకు లక్షణము చెప్పలేదనియుఁ గ్రొత్తగ లక్షణము చెప్పుచున్నాననియుఁ గంఠోక్తిగాఁ గేతనకవి చెప్పెను. ఇట్లున్నను "నన్నయభట్టాదికవిజనంబులకరుణన్" అనుటచేత నన్నయభట్టు రచించినఁ దనఁబడు నాంధ్రశబ్దచింతామణి చూచి దాని ననుసరించియే కేతన