పుట:Andhra-Bhashabhushanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vii


మ్రానయ కేతన యనుటచే నాతఁ డింకొఁకడనుట యుక్తముగాదు.

కేతనకవి తల్లిపేరు సంకమాంబయో, అంకమాంబయో ధ్రువపఱచుప్రయోగము గనఁబడలేదు గాని, "మారయకు, నంకమాంబకు" అని యనేకస్థలములలో నుండుటచేత అంకమాంబ యంటిని. నకారసకారములకుఁ దాళపత్రగ్రంథములలో భేదము గనిపట్టుట గష్టము. అంకాలమ్మ, అక్కమ్మ యనుపేళ్లు ప్రాయికముగాఁ గలవు. మహాంకాళమ్మ, అంకాళమ్మ, అంకాలమ్మ, అంకమ్మ అను రూపములు మహాకాళమ్మ శబ్దమున కపభ్రంశములయి యుండును. సంకమ్మ యనుపేరు శ్రుతచరము గాదు. తాళపత్రగ్రంథముల వ్రాఁతనుబట్టియును అంకమాంబ యనుటయే యుచితమని తోఁచినది.

దశకుమారచరిత్రము గృతినందిన తిక్కన సోమయాజితోపాటు తత్కృతికర్తయగుకేతన పదుమూఁడవశతాబ్దికి నడిమనున్న వాఁడనుట నిర్వివాదము. ఆంధ్రభాషాభూషణ గ్రంథాంతమందు "ఇది శ్రీమదభినవదండివిరచితంబైన యాంధ్రభాషాభూషణంబునందు సర్వంబు నేకాశ్వాస"మని కొన్ని ప్రతులలోఁ గలదు. ఆంధ్రసాహిత్యపరిషద్భాండాగారమందు 552 సంఖ్యగల తాళపత్రగ్రంథమున