పుట:Andhra-Bhashabhushanamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభాషాభూషణము

17

    మ్ముల దానిమీఁది యుత్వము
    పొలుపుగ హ ల్లుండెనేనిఁ బోపు న్నిలుచున్. 64

ఆ. మారుమండఁ జొచ్చె మార్మండె వ్రే ల్మట్టె
    వ్రేలు మట్టె వేడ్క వేడు కయ్యె
    కాఱుకాల మనఁగఁ గార్కాల మనఁ గాన్పు
    కాను పనఁగ నెల్లకడలఁ జెల్లు. 65

ఆ. ఏకపదము నడిమియిత్వ మొక్కొకతఱి
    నచ్చతెనుఁగులోన నడఁగుఁ బొడముఁ
    గూర్మి తాల్మి యనఁగఁ గూరిమి తాలిమి
    యనఁగ గృతులఁ జెల్లు చునికిఁ జేసి. 66

క. అ ఱ్ఱి ఱ్ఱంతంబులపై
   యుఱ్ఱగు నన్నయును దల్లియును ననుక్రియ నా
   యుఱ్ఱంత మొందుచోటుల
   నుఱ్ఱగు మనుమఁడును నందనుండును ననఁగన్. 67

వ. అనంతరంబ విభక్తులు చెప్పెదఁ బ్రథమయుఁ ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్తమియు సంబోధనంబు నన నెనిమిదితెఱంగుల విభజింపఁబడుటం జేసి విభక్తు లనంబరఁగె. చేయువాఁడు ప్రథమయుఁ,