పుట:Andhra-Bhashabhushanamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ఆంధ్రభాషాభూషణము

క. న న్నెఱుఁగు నన్ను నెఱుఁగున్
   దన్నెఱుఁగుచుఁదన్ను నెఱుంగుఁదత్త్వజ్ఞుఁడిలన్
   ని న్నెఱుఁగు నిను నెఱుంగును
   నన్నం బరువడిగ నివి యుదాహరణంబుల్. 60

క. తన కెనయె తనకు నెనయే
   ముని కెనయే మునికి నెనయె మూర్ఖుం డనఁగాఁ
   గునులకుఁ గినులకు జగతిన్
   దనరంగా వరుసతో నుదాహరణంబుల్. 61

క. [1]పొసఁగం బల్కెడునెడ బొ
   ల్పెసగినప్రథమాంతములపయిం గదిసి కడున్
   బస నారుకచటతపల ను
   గసడదవల్ ద్రోచి వచ్చుఁ గవిజనమిత్రా! 62

తే. సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియె
    సుతుఁడు డక్కరితోఁడఁ దాఁ జుట్ట మయ్యె
    సుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు వుట్టె
    ననఁగ నివి యుదాహరణంబు లయ్యెఁగృతుల. 63

క. లెలుఁగులలో నచ్చంబులు
   [2]డులు రులు సులు పదముతుది నడమఁ గలిగిన ని

  1. ముద్దరాజు రామున రాఘవపాండవీయవ్యాఖ్య
  2. డులు రును బెరపదము.