పుట:Andhra-Bhashabhushanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ఆంధ్రభాషాభూషణము


జేయంబడినది ద్వితీయము, నుపకరణంబు తృతీయయుఁ, జేయించుకొనువాఁడు చతుర్థియుఁ, బాయుటకు న్బట్టయినది పంచమియు, నొడయందు షష్ఠియు, నునికిపట్టు సప్తమియు, సమ్ముఖంబు సేయునది సంబోధనంబును నగు. వానికి నేకవచనబహువచనభేదంబులన్ బ్రత్యేకంబు రెండువిధంబులఁ జెందు నందుఁ బ్రథమ యెట్లనిన. 68

క. పలు కనుట యేకవచనము
   పలుకుపయి న్లులను నిలుప బహువచనంబుల్
   నెల నెల లనఁ దల తల లనఁ
   జిలుక చిలుక లనఁగ జగతిఁ జెల్లుటవలనన్. 69

క. డుల నెల్లయెడల ద్రోచును
   దెలుఁగువిభక్తులక్రమంబుఁ దెలిపెద ననఘుల్
   బలవంతులు ధనవంతులు
   కులజులు నయవిదులు భావుకులు ననఁ జనుటన్. 70

క. లులమీఁద లులకు రుఱ్ఱగు
   నిలఁ బెక్కిట బాలు రన మహీపాలు రనన్
   లలితదయాళు రనంగా
   నలవడ వర్తిల్లుఁ గాన నభినవదండీ. 71