పుట:Andhra-Bhashabhushanamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiii


తాను, నేను శబ్దములుదక్క మిగిలినవానిలోని ప్రథమమీఁది కచటతపలకు, గసడదవలు వచ్చును. వికృతిపదముమీఁది సంస్కృతపదములకు రావు అని కలదు. గసడదవాదేశము నిత్యమే కాని కొన్ని యపవాదములు విధించెను. కేతన యిచ్చిన యుదాహరణములనుబట్టి సాంస్కృతికములకు రాదను నపవాదసూత్రము విధించియుండునా యని యూహించిన నూహింపవచ్చును.

ఆంధ్రభాషాభూషణ మెంత చిన్నపుస్తకమయినను విపులవ్యాకరణములు లేనికాలమున మహోపకారము చేయుటయేగాక, తర్వాతి వ్యాకరణకర్తలకు మార్గదర్శక మయినది.

కేతన పద్యరూపమున వ్యాకరణము రచించునపుడు సంబుద్ధిరూపముననో, మరియొకవిధముననో తననామము తనబిరుదములు నందుఁజేర్చి శాశ్వతములు గావించుకొన్నాఁడు.

I. "అలవడి యీ క్రియలు చెల్లు నభినవదండీ." 139

II. "ఎలమి నీవు మీరు...నూత్నదండి చెప్పె". 106

III. "మానకెఁడులనొందు మీఁద మ్రానయకేతా" 189

Iv. "గసడదవల్ ద్రోచినిల్చుఁ గవిజనమిత్రా". 62

కేవల వ్యాకరణవిషయ మిందుఁ బ్రతిపాద్యాంశ