పుట:Andhra-Bhashabhushanamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxii


శబ్దములకుఁ బరమగువానికి రావనియు, సంస్కృతశబ్దముల లోనివానికి రావనియుఁ బ్రస్తుతవ్యాకరణము. ప్రాచీనశాసనములును వ్రాఁతప్రతులును పరిశీలించినయెడలఁ బ్రథమమీఁది కచటతపలకు గసడదవాదేశము నిత్యమనియును, సాంస్కృతికములకుఁగూడఁ గలుగుననియుఁ దేలును. ఈవిషయమునఁ గేతనభావము పరిశీలింపుఁడు.

"క. పొసఁగఁగఁ బల్కెడుచోఁ బొ
    ల్పెసఁగిన ప్రథమాంతములపయిం గదిసి కడున్
    బసనగు క చ ట త ప ల మును
    గ స డ ద వల్ ద్రోచిపుచ్చుఁ గవిజనమిత్రా. 62

తే. సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియె
    సుతుఁడు డక్కరితోడఁ దాఁ జుట్టమయ్యె
    సుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు పుట్టె
    ననఁగ నివి యుదాహరణంబులయ్యెఁ గృతుల. 63

ఈవిషయమున నాంధ్రశబ్దచింతామణిలోనిశ్లోక మిట్లున్నది.

"గసదడవాస్స్యుః ప్రథమామాత్రాదాత్మాష్మదోర్వినై వైతే, న వికృతిశబ్దాత్పరతస్సాంస్కృతికానాం గసడదవాస్స్యుః"