పుట:Andhra-Bhashabhushanamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxiv


మయినను కేతనకు, సహజమయిన చక్కని కవితా శైలి గలదు. మచ్చునకుఁ గొన్ని పద్యము లుదాహరింతును.

I. క. "నేరములు కాళిదాస మ
      యూరాదులకైనఁ గలుగ నొరులకు లేవే
      సారమతు లైనసుకవుల
      కారుణ్యము కలిమి నేర్చు కవిజనములకున్." 12

II. తే. "పెక్కు సంస్కృతశబ్దంబు లొక్కపదము
        క్రిందఁ దద్విశేషణము లింపొందఁ గూర్చి
       తెలుఁగు తత్సమాసముక్రిందఁ గలుపునప్పు
      డగ్రపదముతో నిలనగు నర్థఘటన." 130

III. తే. "తనవిశిష్టకులాచారధర్మ మనఁగఁ
         దనజగద్గీతసాధువర్తన మనంగఁ
         దనదిగంతరవర్తిప్రతాప మనఁగ
         నివి యుదాహరణంబులై యెందుఁ జెల్లు." 131

సంస్కృతాంధ్రాదిగ్రంథప్రకాశకులయిన మ - రా - శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రుల వారు ఆంధ్రభాషాభూషణము నాచేతికిచ్చి యొకమాఱు చదివి దీనికిఁ జిన్నపీఠిక వ్రాసియిమ్మని చెప్పఁగాఁ జిన్నపీఠిక వ్రాయనెంచితినిగాని వ్రాయఁబూనినపు డనుకొన్నదానికంటె మిగులఁ బెద్దది యయినది. తాళపత్రగ్రంథ