పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐగుప్తవర్తకుడు: మా “పారోఆ” చక్రవర్తులతో దీటైనవారు మీ చక్రవర్తులు. “పారోఆ” చక్రవర్తుల రాజ్యాలు పోయాయి, టోలమీ చక్రవర్తులు వచ్చారు. అయినా మా వర్తకులకు వారూ సహాయం చేస్తున్నారు. కాని ఈ అభీరరాజులు మా రాబడులలో తమకు సగం పంచి ఇమ్మంటారు.

యూదువర్తకుడు: మా కోటలు పడగొట్టి తక్కిన ప్రజలతోపాటు ఉండమంటారు.

రోమకవర్తకుడు: నెమ్మది నెమ్మదిగా మా వర్తకాలన్నీ అభీరుల కిచ్చి మేము మా దేశాలకు వెళ్ళిపోవాలట.

ఆర్యవర్తకుడు:అభీరులకు వర్తకులంటే కోపం. మా వస్తువులు విదేశాలకు వెళ్ళడంగాని,విదేశవస్తువులు దిగుమతి చేయించడానికిగాని వీలు లేదట.

యవన: కాబట్టి మీరు సైన్యాలతో రావడం మాకు మహోపకారం.

బ్రహ్మదత్తుడు: ఇంతకూ మీరంతా రాయబారం రావడానికి కారణం?

యవన: తమ ఆశ్రయిం కోరి వచ్చాము.

బ్రహ్మదత్తుడు: అభీరులను నేను ఓడిస్తే మీకందరకూ ఉపకారం జరుగుతుంది. నేను వచ్చిందే అందుకు. మీరందరూ రాయబారం వచ్చినా సరే, రాకపోయినా సరే. జరిగే ఉపకారం ఎల్లాగా జరిగి ఉండునే.

యవన: కాదు, సేనానాయకా! మీరు పట్టణంమీద విరుచుకుపడకుండా ఉంటే, పట్టణాన్ని మీకు లోబరుస్తాము. అదీ మా మనవి.

బ్రహ్మదత్తుడు: మీరు అభీరుల పాలనలో ఉండి, అభీరులకు ద్రోహం చేస్తామంటే నేనెలా ఒప్పుకోగలను?

యవన: మేము ద్రోహం చేసేవాళ్ళము కాము. మేము అభీర నాయకునితో చెప్పనే చెప్పినాము. భరుకచ్చము అంధ్రులకు తిరిగి అప్పచెప్పవలసినదనీ, లేకపోతే ఆంధ్రులకు మేము సహాయం చేయవలసి వస్తుందనీ.

బ్రహ్మదత్తుడు: అయినా మీ ధర్మం మాకు నచ్చలేదు, మీరూ మాకూ మాకూ జరిగే యుద్దాలలో పాల్గొనకూడదు.

ఇంతలో అంగరక్షక దళపతి వచ్చి బ్రహ్మదత్తునకు నమస్కరించి,

“ప్రభూ! అభీరనాయకులు తమ ఆజ్ఞకై వేచి ఉన్నారు” అని మనవి చేసెను.

బ్రహ్మ: ప్రవేశ పెట్టు.

అభీరనాయకులు లోనికివచ్చి బ్రహ్మదత్తప్రభువునకు నమస్కరించి వారిచే అనుజ్ఞాతులై ఉచితాసనాల కూరుచున్నారు.

4

ప్రభూ! మేమెప్పుడూ శాతవాహన చక్రవర్తుల బిడ్డలము. ఇన్నివందల సంవత్సరాలుగా వారికి శక్తివంచనలేకుండా సేవ చేశాము. సామ్రాజ్యాన్ని మాళవులు మొదలయిన విరోధులు ఆక్రమించకుండా మా స్వాతంత్ర్యం మేము కాపాడదలచుకొన్నాము. తామూ, శ్రీ ఇక్ష్వాకుమహారాజు శ్రీశాంతి మూల మహా ప్రభువూ, శాతవాహన

అడివి బాపిరాజు రచనలు - 6

57

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)