పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాల: మహాప్రభూ! నాకు సార్వభౌములు హృదయమిప్పుడు దిజౌత్ర మవగతమైనది. చిన్న చిన్న రాజ్యములు దురాశచేతను, గర్వముచేతను సంతతమును దమలోదాము యుద్ధములు సలుపుచుండును. అందువలన ప్రజలకు నష్టములు కలుగును. సార్వభౌముల కది యిష్టము లేదు. ఈ తూర్పుతీర ప్రదేశములందు శాంతి యడుగంటిపోయిందని చక్రవర్తులై దేండ్ల క్రిందటనే జైత్రయాత్ర సలిపిరి గదా!

విష్ణు: ఎవరి రాజ్యములు వారు సుఖముగ బరిపాలన చేసుకొనిచుండినచో నీ యశాంతి దుస్స్వప్నము వలే దేశము నావరించి యుండెడిది కాదు.

కాల: చిత్తము.

విష్ణు: అన్నగారు పిష్టపురమునకు బోయి తిరిగి యా నగర మాక్రమింపుమనిరి.

కాల: మహాప్రభూ! తమకొక మనవి చేయవలెనని యుండియు ధైర్యము చాలక యూరకుంటిని. మనము మధ్య దుర్గము కడనే గోదావరీనదీ మధ్యస్థ పట్టిస ద్వీపమునకు బోవు రాజపథము ననుసరింప వలసియుండినది కదా!

విష్ణు: సేనాధిపతీ! తాము కొంచెమోపిక పట్టియుండుడు. నాకాజ్ఞ యిచ్చునప్పటికి పిష్టపురము ననేయున్న మన రాజప్రతినిధి పృధ్వీధృవ రాజేంద్రవర్మ పల్లవసైన్యములతో దలపడుటకు గృష్ణాతీరమునందలి ధనకటక నగరమున కేగెనని, మధ్యదుర్గముకడనే వేగు వచ్చినది కదా!

కాల: అగును మహాప్రభూ! ఏ యుద్ధమునందైనను దాము దీర్ఘమాలోచించియే యుద్ద విధానము నిర్ణయింతురు.

విష్ణు: కాలకంపన ప్రభూ! నా చిన్నతనమునుండియు దామే గురువులై. సంగ్రామ విద్య నాకు నేర్పినారు. కంటికి రెప్పవలె నన్ను గాపాడినారు. మా జనకులు శ్రీ సత్యాశ్రయ కీర్తివర్మ వల్లభ చక్రవర్తులు మహేశ్వర సన్నిధానము జేరుకొని నప్పటికి మే మన్నదమ్ములము చిన్నవారమగుటచే మా పినతండ్రి శ్రీ మంగలేశ చక్రవర్తి మాపై బ్రయోగించిన కుట్రలనుండి మమ్ము రక్షించి తండ్రివలె గాపాడినారు!

విష్ణువర్ధనుని మాటలు వినుచున్న కాలకంపన ప్రభువు కన్నులు చెమరించినవి.

(3)

అంశుమతీకుమారి శుక్రవారమునాడు దోషాపహరణ స్నాన మాచరించిన పిదప శుభ్రవస్త్రధారిణియై, సర్వభూషణాలంకృతయై యిష్టసఖులు గొలిచిరా నంగరక్షక వీరాంగనలు, వీరులు కావలిగాయ దాను విడిదిసేయు భవనము నండియున్నట్టియు, గోదావరీతీరమున కనతిదూరమున నున్నట్టియు గోమాతృ దేవాలయమునకు వోయి షోడశోపచార యుక్తమైన యష్టోత్తరశతనామ గోమాతృదేవీ సమార్చన సలుపుచుండెను.

విష్ణుకుండినులకు గోదేవి కులదైవము. మహారాజులు మహారాణులు రాజకుమారులు రాజకుమారికలును సమస్త విష్ణుకుండిన వంశజులును గోవూరు పుణ్యక్షేత్రమున గోమాతృ దేవాలయమునఁబూజలు సలుపవలయును. ప్రథమ విష్ణుకుండిన చక్రవర్తియగు మాధవవర్మ మహారాజుచే నటులా గోదివ్యాలయము ప్రతిష్టింపబడినది. ఆతడా దివ్యాలయమును బ్రతిష్ఠించుటకొక ప్రబలకారణము సంఘటిల్లినది. మాధవవర్మ

అడవి బాపిరాజు రచనలు - 6

235

అంశుమతి (చారిత్రాత్మక నవల)