పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యవతి

153

నిశ్చయముగల నాతుల నెవ్వరును నవమానింప శక్తులుకారు' అని పలికి దు:ఖాతి రేకమువలన సత్యవతి మూర్ఛిల్లెను. కొంత సేపటి కామె సేదతేరి 'హా పరమేశ్వరా! నన్ను నాప్రాణనాధునితోడఁ గొనిపోవక యేల బ్రతికించితివి ? బ్రతికించినను నాకీసౌందర్య మేల యిచ్చితివి. దీనివలన సుఖము ననుభవించు వారు లేరయిరి. ఇఁక దీనితోడి ప్రయోజన మేమి? సంకట మూలమగు నీసౌందర్యముతో నీప్రపంచమున నుండుటకష్టము కాన ముక్కు, చెవులుగోసికొని విరూపి నయ్యెద' ననియామె యట్లు చేయఁబోఁగా రామానందు లామె నట్లు చేయనియ్యక ననేకనీతులను చెప్పి వృద్ధదాసిని విశ్వాసార్హుఁ డగు భృత్యుని నిచ్చి యామె నరణ్యమార్గమునఁ బంపెను. అప్పుడామెకుఁ గట్టువస్త్రము దప్ప నన్యవస్త్రముగాని దగ్గర ధనముగాని లేదయ్యెను.

కోడలినంపి రామానందులు భగవన్నామ సంకీర్తన చేయుచుండఁగా రాజభటు లచటికి వచ్చి యతనిని బట్టుకొని పోయి కారాగృహమునం దుంచిరి. సత్యవతి కొంతదూర మరిగి ముందుపోవ మనసొప్పక మరలి మామగా రున్నస్థలమునకువచ్చి యతనిని రాజభటులుగొనిపోయి కారాగృహమునం దుంచిరని వినెను. అప్పుడామె మిగులదు:ఖించి యూరకుండక మరల ధైర్యమవలంబించి మామగారిని విడిపించు నుపాయము వెదకి, తాను పురుష్వేషమును ధరియించి బంధిఖానాను సమీపించి తన సేవకుల నచటనే యునిచి తాను ముందుకువచ్చెను. అచట నధికారియగు రామసింహ జమాదారా బాలునుఁజూచి నీ వెవ్వఁడవనియు, నేలవచ్చితివనియు నడుగఁ