పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

అబలాసచ్చరిత్ర రత్నమాల.

ఆవార్త విని రామానందుఁడును, సత్యవతియు, ప్రేమానందుఁడు చచ్చెనని వగచిరి. తదనంతరము రామానందుఁడు కారాగృహములోని కరిగి యచట దెబ్బలచేత విరూపియయి మూర్ఛఁజెందిన పుత్రుని గుర్తింపక చచ్చెనని తలఁచెను. అంత నతఁ డీవలకు వచ్చి కోడలి కాదు:ఖవార్త నెఱిఁగించి యామెను దీసికొని యరణ్యమార్గమునఁ బోవుచుండెను. సత్యవతి పతి మరణమున కధిక దు:ఖితయయి యనుగమనము చేయ నిశ్చయించెను. కాని రామానందు లామె నట్లు చేయనియ్యకుండెను. వీరిట్లరుగుచుండ దేవీసింహుఁడు సురూపవతు లగు సతులను బట్టి తెప్పించి వారిని దొరల కర్పించి యాదొరల యనుగ్రహము సంపాదించుచుండు ననివార్త వీరికిఁ దెలిసెను. నాఁటినుండియు వారు గ్రామమునందెప్పుడును సంచరింపక అరణ్యముననే తిరుగుచుండిరి. కాన వారు రాజభటులకు జిక్క లేదు. ఇట్లు వీరు నడుచుచు నొకగ్రామ సమీపారణ్యమునకు రాఁగా నాగ్రామమున నొక సౌందర్యవతిని వెదకుచు రక్షకభటులు వచ్చి రనినవార్త వారికి దెలిసెను. అప్పుడు రామానందుఁడు కోడలినిఁ జూచి 'అమ్మా! నీవు నాతోనుండిన నీకు విశేషసంకటములు కలుగును. కాన నీ నీవృద్ధ దాసిని నొక సేవకునినిఁ దీసికొని కాశీక్షేత్రమున కరుగుము' అనిపలికెను. అందుకు సత్యవతి 'మీరు నాకు మామగారైనను నన్ను మీకన్యకకంటె నెక్కుడుగాఁ జూచెదరు. మిమ్మును విడిచిపోవుటకు నే నెప్పుడును సమ్మతింపను. మన మిరువురము కలసియుండుటయే నాకు దు:ఖములో సహితము సుఖముగానుండును. పతివ్రతల నెవ్వరును జెఱుపలేరు. మనో