పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/168

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
154
అబలాసచ్చరిత్ర రత్నమాల.

గా నతఁడు తనపేరు 'నాన'కనియుఁ దన నివాసస్థలము గయా జిల్లాలోని పూర్ణియా యనుగ్రామమనియుఁ దా నుద్యోగము నిమిత్తము వచ్చితిననియుఁ జెప్పెను. అందుపైనతఁడా బాలునిఁ దనయొద్ద నల్పజీతమున కుంచుకొనియెను. ఈ వేషధారి బాలకుఁడు నిత్యముయజమానునిసేవ బాగుగాఁజేసి యతని కృపకుఁ బాత్రుడయ్యెను. అంతనొకనాఁడతఁడు కైదు ఖానాలోనికి యజమానునియనుజ్ఞ వలన నరిగి మిగుల యుక్తిగారామానందుల నచటినుండివిడిపించి విపినమార్గమున నరణ్యమధ్యమునందున్న యొక యోగిని [1]గృహమునకుఁ దీసికొనిపోయెను. వారచటికరిగియామెతోఁ గొంత ప్రసంగించునంతలో చచ్చిపోయెననుకొనిన ప్రేమానందుఁడు బ్రతికి కలకత్తాలో కారాగృహమునందుండినట్లు తెలిసెను. అప్పుడు సత్యవతి యొకభృత్యుని వెంటఁదీసికొని భర్తను విడిపింతునని పురుషవేషముతో రామకృష్ణుడు డనునామమునఁ కలకత్తాకుఁ బయలు దేరెను. ఆపదలు మనుష్యులకు శత్రువులని తలఁచెదరుగాని నిజముగా విచారింపఁగా గొప్పవారి కవి మిత్రులనియే చెప్పవచ్చును. ఆపత్కాలము వలననె గొప్పవారిపవిత్రచరిత్రము, చాతుర్యము ధైర్యము మొదలైనగుణములు వెల్లడియగుట కవకాశము కలిగి వారికీర్తి జగద్విఖ్యాతమగును.

  1. ఈయోగిని యవతయో తెలియదు; కాని యాకాలమునందే యుండి యాదేవిసింహుని భయముచేతనే యరణ్యమునందు యోగినిగా వాసము చేయుచుండిన 'కమలాదేవి'యే యై యుండవచ్చునని యూహింపఁబడుచున్నది. కమలాదేవిచరిత్రచూచునది.