పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాసాగరజనని భగవతీదేవి

తే. ఒక పరోపకారంబు చేయుటయె కాదె
   యిలపయిని జన్మమెత్తి:ఫలము మనకు;
   గాన మన మేలుచూడకయైన దరుణి!
   పరులకుపకార మొనరింపవలయు జూవె. - వీరేశలింగకవి.

బీదలయొక్కయు, దు:ఖితులయొక్కయు బంధుడును, వంగదేశముయొక్క సత్పుత్రుడును, భారతవర్షమను ఆకాశమునకు దేజోమయమగు నక్షత్రమును, విధవాబంధుడును నగు ఈశ్వరచంద్ర విద్యాసాగరుని తల్లియగు భగవతీదేవీ చరితము సకలజనులకు ననుకరిణీయము. ఏ సద్గుణములవలన విద్యాసాగరుడు ప్రాత:స్మరణీయి డాయెనో, యా సద్గుణములకు మూలకారణ మాతని తల్లియే యని బహుజనులకు దెలియదు. ఎట్టి విత్తో, యట్టి ఫలమే కలుగుననుట భగవతీదేవీ విద్యాసాగరుల చరిత్రమువలన దెలియును. దయ, ధర్మము, క్షమ మొదలైన సద్గుణములు భగవతీదేవి వలన నే విద్యాసాగరునికి బట్టుపడెను. కావున విద్యాసాగరుడు తన తల్లిని సాక్షాదన్న పూర్ణనుగా భావించి పూజించుచుండెను.

ఈమె 1724 వ బంగాలీ సంవత్సరము ఫాల్గుణమాసము నందు బంగాలీదేశము నందలి యొక పల్లెయందు బ్రాహ్మణ వంశమున నవతరించెను. ఈమె తండ్రిపేరు రామకాంతచట్టోపాధ్యాయుడు. తల్లి గంగాదేవి. రామకాంతుడు చిన్నతనము