పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుండియు దైవభక్తిగలిగి విరక్తుడయ్యెను. ఆతడు విశేషముగా నెవ్వరితోను మాటలాడక అరణ్యమున కరిగి,, యేకాంతముగ జపము చేసికొనుచుండెడివాడు. ఆయన బొత్తుగ సంసారమూ నందు విరక్తుడగుట విని గంగాదేవి తండ్రియగు విద్యావాగీశుడు తన పుత్రికను సంతానసహితముగా పాతూలగ్రామమునకు గొని చనెను. నాటినుండియు గంగాదేవి తన యిరువురు కూతులతో పుట్టినింటనే యుండెను. పంచానన విద్యావాగీశునకు నిరువురు కన్యకలును, నలుగురు కొమాళ్లును ఉండిరి. వారిలో బెద్దకొడుకు పేరు రామమోహన విద్యాభూషణుడును, రెండవవాని పేరు రామధన్‌తర్క వాగీశుడును, మూడవవాని నామము గురుప్రసాద శిరోమణియును, నాల్గవాని పేరు విశ్వేశ్వర తేర్కాలంకారుడును. ఈ కుటుంబము విద్య, దయ, ధర్మము, అతిథిసత్కారము మొదలయిన సద్గుణములచే విశేషఖ్యాతి వహించెను. విద్యాసాగరుడు తన జీవనచరితమునం దీ పరివారమును గూర్చి యిట్లు వ్రాసెను. "అతిథి సేవయందును, అభ్యాగతుని సన్మానించుట యందును నీ కుటుంబమునకుగల శ్రద్ధ మిగుల స్తుత్యము. అట్టి శ్రద్ధ మరియొక చోట గానుపించదు. ఆ పరివారమునం దీ సద్గుణములు లేనివా రొకరును గానరాకుండిరి. రాధామోహనవిద్యా భూషణుని వాకిటికి వచ్చి యన్న మడిగి దొరకక వెళ్ళిపోయిన యతిథి యొకడును కానరాడయ్యె. ఆ యింటనుండు బాలురు వృద్ధులు నందరును ఇట్టి గుణములు గలవారే." ఇట్టి పరివారములో బెరిగి నందుననే భగవతీదేవికి నట్టి సద్గుణములు పట్టువడెను. అందువలననే యదివరకు దురదృష్టవంతురాలగు