పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రత్యక్షదుర్గవలె యుద్ధభూమికి వెడలెను! ఆమెనుజూచి సైనికుల కందరికిని ఉత్సాహము గలిగి వారిశౌర్యము మినుమడియై వారు శత్రుసైన్యముపై నడరి యతిధూర్తు లగు యవన సైనికుల ననేకుల రూపుమాపి, మరునాడా సేనాధిపతిని యమ సదనమున కనుప నిశ్చయించిరి. కాని, డిల్లీశ్వరునిచే మహావీరుడని ప్రఖ్యాతిని గాంచిన ఆసఫ్‌ఖాన్ కొద్దిసైన్యముతో నీమెను జయించుట దుస్తర మని తెలిసికొని, మరునా డింకను సైన్యమును గూర్చుకొని, తమవద్దనున్న ఫిరంగిలన్నియు నగ్రభాగమునందుంచి, గోండుసైనికులపై నకస్మాత్తుగా వచ్చి, తన సామర్థ్యమంతయుజూప, వారు చీకాకుపడి శత్రువుల మార్కొన శక్తులు కాకయుండిరి. ఇట్టి దురవస్థజూచి, దుర్గావతీ కుమారుడల్పవయస్కు డయ్యును, అభిమన్యు కల్పుడుగానతాను ముందై వెరవవలదని సైనికులకు ధైర్యమిచ్చి, శత్రువులను మార్కొనెను. ఇట్లు కొంతసేపు మహాధైర్యముతో బోరాడి యాబాలశూరుడు బాణఘాతముచే మూర్ఛిల్లెను. అప్పుడు సైనికు లందరు చింతాక్రాంతులై యాదు:ఖవార్త యింకొకవైపున తురకలను మర్దించుచున్న దుర్గావతికి దెలియజేసిరి. ఆమాటవిని, దు:ఖించుట కది సమయము కాదనియెంచి రాణీగారిసుమంతైనను జలింపక పుత్రవాత్సల్యమును ఆపి, తనసేనాధిపతికి నిట్లు వర్తమానము చేసెను. "ఈసమయము ధైర్యమును వదలి దు:ఖించుచు కూర్చుండ తగినదికాదు. శత్రుహననము మన ముఖ్యకర్తవ్యము. ఈశ్వరేచ్ఛ వలననైన కార్యమునకు వగవ పనిలేదు. కాన పిల్లవానిని శిబిర