పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకు గొనిపోయి తగిన యుపచారములు చేయుడు. నేనిప్పుడు యుద్ధమును విడిచి వచ్చుటకు వీలులేదు. రణయజ్ఞము సమాప్తముచేసి, ప్రాప్తియున్న మరల జూచెదను." ఈయనుజ్ఞ ప్రకారము సైనికులు కార్యమును జరిపిరి.

యుద్ధమునందు గొంతసేపు వారికి జయమును, కొంతసేపు వీరికి జయమును గలుగుచు; తుద కెవరు గెలుతురో నిశ్చయించుటకు వీలులేకయుండెను. ఇట్లు కొంతసేపు వుభయపక్షముల సమానముగా యుద్ధముజరిగి, అది హిందువుల స్వాతంత్ర్య నాశన కాలముగాన, తురుష్కులకే యాధిక్యము వచ్చెను. గోండుసైనికులు పోరాడిపోరాడి, ఉత్సాహహీనులైరి. గోండులెట్లెట్లె ఉత్సాహహీనులైరో, అట్లట్లు మ్లేచ్ఛుల బలము హెచ్చుచుబోయెను. తమరాజ్యమును గోండుదేశమునందు స్థాపించవలె నన్న దృడేచ్ఛ గలవారు గనుక 'దీన్‌దీన్‌' అను రణశబ్దముచ్చరించుచు ఘోరముగా గోండు సైన్యములను దెగటార్చిరి.ఇట్లుభయకంరయిన హననయజ్ఞము జరుగగ, మూడువందల సైనికులతోడ దుర్గావతిరాణిమాత్రము బ్రతికి భయంకరముగా బోరాడుచుండెను. ఆమెను మార్కొనుటకు ఆసఫ్‌ఖాన్ దుర్గావతివద్దకి స్వయముగా వచ్చెను. కాని యామె రౌద్రమునుజూచి భయమంది, దూరముపోయి, అటనుండియామెపై బాణవర్షమును గురిపించదొడగెను. ఆమెయాబాణముల నన్నిటిని దునిమెను. కానియందొక బాణము శిరస్సునందు గ్రుచ్చుకొనగా నామె మరింత క్రోధాయమానమానసయై, ఆ బాణమును తానె పెరికివైచి, మరింత రౌద్రముతోయుద్ధము చేయ