పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డగు బిరజుడనురాజు, టుకటోడా యను గ్రామమును రాజధానిగా నేర్పరచుకొని ప్రజాపాలనము జేయుచుండెను. ఇతని తండ్రి బ్రతికియున్నను, అతడతివృద్ధు డయినందువలన, బిరజుడే ప్రజాపరిపాలనము చేయుచుండెను. వృద్ధరాజుకు బిరజుడుగాక వేరుసంతానముండెను. వారందరిలో గడగొట్టు కూతురి పేరు వీరమతి. ఈమె యందరికంటె జిన్నదయినందున గడు గారాబముగా బెరుగుచుండెను. చిన్ననాటినుండియు రాజపుత్రులతో గలసి మెలసి యుండుటవలన నామె రాజపుత్రులు నేర్చుకొను విద్య లన్నియు నేర్చుకొనెను. కావ్య వ్యాకరణాదుల యందు నామె కృషి చేసినదో లేదో తెలియదుగాని, చక్కగవ్రాయుట, చదువుట, లెక్కలు మొదలైనవానిలో నామె ప్రవీణత సంపాదించినదని చరిత్రము వలన దెలియవచ్చుచున్నది. ఇదియును గాక అశ్వారోహణము, గజారోహణము, సాము చేయుట, గద ద్రిప్పుట, యుద్ధములో వింట నంబుపయోగించుట మొదలైన రాజపుత్రుల కత్యంతావశ్యకమైన ధనుర్విద్యలును ఆమె నేర్చుకొనెను! ఇట్లు యుక్తవయస్సు వచ్చు వరకు వీరమతి స్త్రీలకు స్వాభావికములగు సౌందర్య గాంభీర్య వినయాది సుగుణములను విడువకయే 'పుంవత్ర్పగల్భ్' యయ్యెను.

వీరమతి దినదినప్రవర్ధమానయై పదునారు సంవత్సరంబులది కాగానే, యామె వివాహ యోగ్యయైనదని తలచి అప్పుడు గల యత్యంత శ్లాఘనీయమయిన స్వయంవర పద్ధతి ననుసరించి యామె వివాహము చేయ నిశ్చయించి, ఆమె యన్నగారగు బిరజమహారాజు దేశ దేశములకు విప్రుల పంపి, అచ్చట