పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాభూషణము వారికి లేకుండ జేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలు బొమ్మలవలె చేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రగా జూడాక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీలవిషయమున జేసిన యిట్టి యన్యాయమువలన స్త్రీలను మూడురాండ్రనుగా జేసి చెడగొట్టుటయేకాక తామును వారి తోడిపాటుగా మూడ శిరోమణులయి చెడిపోవుచున్నారు. అందుచేత పురుషులలో గూడ నిజమయిన ఈశ్వరభక్తియు సద్వర్తనమును బోయి మూడభక్తియు, నీతిరాహిత్యమును వర్థిల్లుచున్నవి. దానినిబట్టి నిజమయిన సౌఖ్యమును సంతోషమును లేక యనేకులకు భూతలస్వర్గముగా నుండవలసిన గృహము మహారణ్యమువలె నగుచున్నది. ఏయింట జూచినను నైకమత్యమునకు మారుగా కలహములును, మనస్తాపములును పెరుగుచున్నవి. ఈస్థితి యంతయు పురుషుల లోపమువలనను స్వప్రయోజన పరత్వము వలనను గలుగుచున్నదేకాని స్త్రీల దోషమువలన నణుమాత్రము గాదు. ఏకాలమునందును ఏదేశమునందును తమ స్త్రీలను మంచిదశకు తీసికొనిరాక తాము బాగుపడిన పురుషులు లేరు. తాము బాగుపడదలచిన పక్షమున ముందుగా తమస్త్రీలను బాగుచేయవలెను. స్త్రీలబాగే పురుషులబాగు; స్త్రీలయోగే పురుషులయోగు. కాబట్టి పురుషులు తమ యోగక్షేమాభివృద్ధి నిమిత్తమే మూడురాండ్రయిన యిప్పటి స్త్రీలను తొంటి యుత్తమదశకు మరల దీసికొని