పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్తమానమంపెను. "కృష్ణాకుమారిని జయపురపురాణా కిచ్చిన యెడల నేను మానసింహునకు దోడుపోయి నీతో యుద్ధము చేయుదును" ఈ వార్తవిన్నంతమాత్రమున భీమసింహుడు తన నిశ్చయమును మరల్పకుండెను. తనమాటను ఉదేపూరు రాణా లక్ష్యపెట్టకుండుట గని సిందే మిగులకోపించి యుద్ధసన్నాహముతో బయలుదేరి యుదయపురమును సమీపించెను. సిందే ఉదయపుర ప్రాంతమున విడిసినపిదప కొన్నిదినములకు భీమసింగుడును సిందేయును నొక దేవాలయములో గలిసి యేమో యాలోచించి జయసింహునకు గన్యనియ్యనని భీమసింగు వర్తమానమంపెను. జయపురాధిపతి తనయాసలన్నియు నిరాశల లగుటవలన మిగుల కోపగించి మానసింహునితో యుద్ధము చేయుటకై సైన్యము సిద్ధపరుప నాజ్ఞాపించెను. మానసింహుడును యుద్ధమునకు కాలుద్రువ్వుచునే యుండెను. అతని శత్రువులు కొందరు లక్షయిరువదివేల సైన్యము పోగుచేసి జయసింహునకు సహాయులయిరి. అప్పుడారాజుల కిరువురకును పర్వతశిఖర మనుస్థలమున ఘోరసంగ్రామము జరిగెను. ఆ యుద్ధమునందు మానసింహుని సైనికులనేకులు జయసింహునితో గలియుటవలన మానసింహుడు యుద్ధమునుండి పలాయితు డయ్యెను. ఇట్లు పారిపోయి యాతడు యోధగడయను దుర్గములో దాగియుండెను. జయసింహునిసేన యోధగడను ముట్టడించి భేదింప దొడగెను. కాని యాదుర్గ మభేద్య మగుటచే వారు దానిని భేధింప నేరక మరలిపోయిరి. ఈయుద్ధము నందు జయసింహుని సైన్యము మిగుల నాశమొందెను. కాన