పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరముగా నుండును. కాన రాణాగారు సమానవంశీకుని వెదకుచుండిరి. కానియట్టి వరునకు విద్యాగుణములు సరిపడవయ్యెను. విద్యాగుణైశ్వర్యములు కలవరుని వెతకినచో వాడు కులీనుడు గాక పోవుచుండెను. ఇందువలన గన్య నెవ్వరి కిచ్చుటకును కొంతవడి నిశ్చయింపనేరక తుదకు మార్వాడదేశపు రాణాయగు భీమసింహునకు గన్య నియ్యనిశ్చయించెను. కాని ప్రారబ్ధవశమున నల్పకాలములోనే మార్వాడ భీమసింహుడు స్వర్గస్తుడయ్యెను.

తదనంతరము జయపురాధీశ్వరుడగు రాణాజయసింహుడు కృష్ణాకుమారిని తనకిమ్మని యడుగుట కొకదూత నంపెను. ఉదేపురాధీశ్వరుడును అందుకు సమ్మతించి కన్యను జయసింహున కిత్తునని చెప్పెను. ఇంతలో మార్వాడదేశపు సింహాసనము నెక్కిన రాణామానసింహుడు భీమసింగున కిట్లు చెప్పి పంపెను. "ఇదివర కీసింహాసనమున నున్నవానికి కన్యనిచ్చుటకు నిశ్చయించితిరి, విధివశమున నాతడు కాలధర్మము నొందెను. అయినను నీకన్య యీ సింహాసనమునకు వాగ్దత్తయయియున్నది. కాన నాకియ్యవలయును" రాణాభీమసింగుడు మార్వాడ రాణాదూతతో మీరాజునకు నాకూతు నియ్యనని స్పష్టముగా దెలియజెప్పి పంపెను. అందువలన మార్వాడ దేశమునకును మేవాడదేశమునకును వైరము సంప్రాప్తమాయెను. ఆ రెండుదేశముల యందు సంగ్రామ సన్నాహములు జరుగుచుండెను. ఆ సమయమునందు గ్వాలేరురాజగు సిందేజయపురాధీశ్వరునిపై మిగుల వైరము కలవాడయి భీమసింగున కిట్లు