పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయపురాధీశ్వరుడు తనపురమునకు బారిపోయెను. మానసింహుని శత్రుడయిన రాజొకడు తనసైన్యములోని నవాబూమీర్ ఖానను మ్లేచ్ఛునిచే చంపబడెను. ఈవిశ్వాసఘాతకుడగు తురుష్కుడే పిదప ననేక యుక్తులచే నుదేపూరు రాణాకుముఖ్య స్నేహితు డయి అజితసింహుడను నాతనిని గృష్ణాకుమారి తండ్రికడ సేవకునిగా నుంచెను.

ఇంత సంగ్రామమయినను జయసింహ మానసింహుల కింకను యుద్ధమునందలి యిచ్ఛ తగ్గదయ్యెను. అందువలన వా రిరువురును దళములతోడ ఉదేపురమునకు వచ్చుచుండిరి. కాన నాసంగతివిని భీమసింహ రాణా మిగుల చింతతో నా యుభయులను సమాధాన పరచు నుపాయము విచారింపు చుండెను. ఆయన కేమియు దోచక అమీర్ ఖాను నేకాంతముగా బిలిచి యాలోచనయడిగెను. అప్పుడా దుష్టుడు కృష్ణాకుమారిని మానసింహున కిచ్చుటొండె, చంపుటయొండె యుత్తమమని చెప్పెను. అంతలో కృష్ణాకుమారిని చంపుటయే యుత్తమమని రాజునకు దోచెను. కాని యాపని చేయుట కాతని సేవకులలో నొకడును నొడంబడడయ్యెను. భీమసింగుడు ఒక సేవకునిం బిలిచి కొమార్తెను జంప నాజ్ఞాపించెను. అందు కాభృత్యుడు ప్రభువును తిరస్కరించి తానట్టిపనిని చేయనని నిశ్చయముగా జెప్పెను. తదనంతరము రాణాగారు యౌవనసింహుండను వానింబిలిచి యీ ఘోరకర్మ చేయుమని చెప్పెను. ఈ యౌవనసింహుం డట్టి కార్యము చయుటకు దనకిష్టము లేకున్నను రాజాజ్ఞకు వెరచి దాని