పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాబాయి పగతుని దెగవేసినపిదప నా మువ్వురును గ్రామమావలనున్న తమ సైనికుల గలియబోవుచుండిరి. ఇట్లు పోవువారికి సింహద్వారముకడ మత్తగజమును కొంత సైన్యమును అగుపడి వారి నడ్డగించెను. దానిగని వారు ప్రధమము నందించుక జంకిరి కాని వీరులగు పృథివీరాజు తారాబాయియు మరల ధైర్య మవలంబించిరి. ఆ సమయమునం దామత్తగజము సమీపింపగా తారాబాయి తన చేతనున్న ఖడ్గముతో నా ఏనుగు తొండమును నరికెను. అంత నా నాగము ప్రచురధ్వని సేయుచు నావలి కరుగగా నామువ్వురు యోధులును నచటి స్వల్పసేనను సరకుగొనక నగరము వెల్వడిరి.

తామిటులు తమ యోధుల గలసికొనిన పిదప పృథివీరాజు థోదానగర సైన్యముల కెదురై పోరుడని తన సైనికుల కాజ్ఞాపించెను. రాజాజ్ఞయైన తక్షణమే యా వీరభటు లాపట్టణమును ముట్టడించి యచటి సేనలను నలు మొగంబుల బార దోలిరి. ఆ యుద్ధమునం దచటగల తురకలలో మూడువంతుల వరకు బగరచే జచ్చిరి. తదనంతరమునందు పృథివీరాజును తారాబాయియు మహోత్సవముతో నగరము ప్రవేశించిరి. తమకు జయము దొరికిన పిదప తమ సైనికులు మ్లేచ్ఛులను పట్టుకొని బాధించుటగని తారాబాయి అట్లు చేయవలదని స్వసైన్యముల కాజ్ఞాపించెను.

ఇట్లు సూరథాన్ రాయులకు రాజ్యము దొరకినపిదప తారాబాయి పృథివీరాజును వరించెను. సూరథాన్ రాయులు కూతురి వివాహానంతరము తనరాజ్య మల్లునకిచ్చి తాను