పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. మొదటిప్రశ్నకుత్తరము:- నేను వైద్యమునేర్చుకొన దలచి యమేరికాదేశమునకు వెళ్ల నిశ్చయించితిని. ఈ హిందూదేశమునందు స్త్రీలకు జికిత్స జేయదగిన సాధనకలాపము లేని కారణమువలన గలిగెడి బాధలను ఇప్పు డిక్కడకు దయచేసిన నారీమణులు బాగుగా దెలిసికొని యున్నారు. ప్రకృతిశాస్త్రములను, స్త్రీవిద్యను, నెలయింపజేయ నీ దేశమున వెలయుచున్న సమాజము లెవ్వియు మనదేశపు యువతుల నేరినిగాని, నాగరికతచే బ్రతిష్ఠం గాంచిన ఖండాంతరముల కంపించి వైద్యశాస్త్రప్రవీణలను గావించి, వారిచే నిచ్చటం బ్రమదల కా వైద్యశాస్త్రమును గరపు కళాశాలలను స్థాపింప దలంపమికి నే నత్యద్భుతము నొందుచున్నదానను. తనకుగల లోపముల నెల్ల వెల్లడి సేయక తన్నివారణార్థమై యర్థింపక యుపేక్షించుచు నిందాస్పదమైనదేశము, ఈ హిందూదేశమున కంటె మరియొక్కటి యేదియు లేదు. ఈ హిందూదేశమంతట స్త్రీవైద్యులు లేని లోపము కష్టముగనున్నది. యూరపుదేశపు నారులును, హిందూసుందరులును, అవసరము తటస్థించినప్పుడు పరపురుషులకు తమదేహస్థితిని వివరించి వారిచే జికిత్స జేయించుకొనుటకు సహజముగా నిష్టపడక యున్నారు. యూరపు, అమెరికాదేశములనుండి యిక్కడకు కొందరు స్త్రీవైద్యులు వచ్చుచున్నారు. గాని, వారిభాషయు, నాచారమర్యాదలును, గ్రొత్తలగుటచే, వారు మనస్త్రీలకంతగా, నుపయోగపడక యున్నారు. తమ దేశమందును దమవారయెడలను నైసర్గిక మయిన ప్రేమగల హిందూసుందరులు పరదేశ యువతులతో