పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలసి మెలగలేరు. కావున వారివలన నే సహాయలాభమును బడయజాలకయున్నారు. ఈ హిందూదేశమున, స్వదేశ స్త్రీవైద్యుల అక్కర మిక్కిలిగా నున్నట్టు నాకు దోచుచున్నది.

2. ఇక నీ హిందూదేశమునం దందులకు తగిన సాధనములు లేవా యను రెండవ ప్రశ్నమున కుత్తరము:- లేవని నిష్కర్షగా మనవిచేయుచున్నాను. కానివున్న సాధనములు సులభసాద్యములు గావని నా యభిప్రాయము. చెన్నపురి యందు నొక సర్వకళాశాలయు నన్ని రాజధానులలోను మంత్రసానితనము నేర్పు తరగతులును నుండుట సత్యమే. అయిన నందలి బోధకులు ప్రాచీనాచారప్రవిస్టు లగుటచేతను, కొంతవర కసహిస్ణులగుటవలనను అచ్చట నొసంగబడుచున్న విద్య యసంపూర్ణ మయినదిగాను లోపములతో గూడినదిగాను నున్నది. ఇట్లనుటనే నా బోధకుల తప్పుల నెంచుటకు గాదు సుడీ. అది పురుషుల స్వభావమని మనవిచేసితిని. వీరికి మారుగా నాస్థానములను స్త్రీలలంకరించువరకిట్టి యిబ్బందులకు మన మోర్చుకోవలసి యున్నది.

నేను క్రైస్తవురాలనుగాను: బ్రాహ్మమతావలంబినిని గాను కాబట్టి హిందూ మతాభిమానము గలిగి తద్ధర్మముల ననుష్టింపుచు నీదేశమున నెందయినను పాఠశాలకు బోయి విద్యగరచుట నాబోటి బోటికి దుష్కరము. ఇంగ్లీషువారి యుడుపుల దొడిగికొని నడయాడు మతాంతరులయినను ఇచటి ప్రజలు నన్ను జూచినట్టూరక యెగదిగ జూడరు. నగరులలోను, వెలుపలను, నావంటి హిందూయువతులకు గలుగుచున్న దురా