పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్టించుకొనెను. ఇట్టిదిగదా స్వదేశాభిమానము!ఈమె ఆమేరికా కరుగునని విని యనేకు లనేకాక్షేపణలు చేసిరి. కాన వారి కందరకును సమాధానకరముగా ఆనందీబాయి యొక పాఠశాలా మందిరమున సభచేసి గంటసేపు హూణభాషయందు నస్ఖలితముగా నుపన్యసించెను. అందువలననే యామెకు నింగ్లీషునందు గల ప్రజ్ఞయు, నామెయొక్కయప్రతిమ వక్తృత్వశక్తియువెల్లడియగుచున్నవి. ఆయుపన్యాస మత్యంత శ్రవణీయము. కాన జనానాపత్రికోక్తముగా నిచ్చట నుదాహరించుచున్నాను.

"నా యమేరికాదేశయాత్రను గురించి వందలకొలది ప్రశ్నలు నన్ననేకు లడుగుచున్నారు. కావున నే నిప్పుడు అవకాశము గలుగజేసికొని వానిలో గొన్నిటికి బ్రత్యుత్తరములం జెప్ప దలంచితిని అవి యెవ్వనగా:-

1. నేనమేరికాదేశ మేల వెళ్ళవలెను ?

2. హిందూదేశమునందు గృషిచేయుటకు నాకు సాధనములు లేవా ?

3. నేనొంటిరిగా నేల వెళ్ళవలెను ?

4. నేనీ దేశమునకు తిరిగివచ్చినప్పుడు జాతిలోని వారినుండి బహిష్కారము గలుగదా ?

5. ఏదేని యాపద సంభవించిన యెడల నేనేమి చేయ వలెను ?

6. స్త్రీలలో నెవరునుజేయని పనిని నేనెందులకు జేయవలెను ? అనునవి.