పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరల తన దివ్యతేజమును బొందెను. జనులందరును పరమానంద భరితులయిరి. విరాబాయి జయమును గాంచి విశేష తేజస్విని యయ్యెను. పురవాసులందరా వీరరజపూతులను, రాణిగారిని మంగళ వాద్యములతో నెదుర్కొని వారిపై పుష్పవృష్టి చేయుచు రాజభవనములో బ్రవేశపెట్టిరి! ఇట్లు జన్మమందెప్పుడును యుద్ధమెరుగనిదయ్యును ఒక క్షణములో తన శౌర్యముచే విరాబాయి "గొప్ప శూరస్త్రీ" యన్న బిరుదునుబొంది, ప్రస్తుత చరిత్రమునకు శిరోలేఖముగా నున్న శ్లోకార్థమునే స్థిరపరచెను.!


_______