పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెడలెను. ఆమె తన సైన్యముతో నాకస్మికముగా నాకొన్న యాడుసింగమువలె శత్రుసైన్యములపై నకస్మాత్తుగా బడెను. అందువలన విజయానందమునం దోలలాడుచుండిన యగ్బరు సైన్య మీ ప్రళయమున కోర్వజాలక నలుదిక్కులకు బారదొడగెను. వారిని బోనియ్యక పట్టుకొని విరాబాయి సైనికులు కాలాంతరుద్రుల భంగియంతము నొందింపసాగిరి. వారికి వుత్సాహకరముగా వీరాబాయి తానును అనేక తురుష్కులను వీరస్వర్గమునకు నంపుచుండెను.

ప్రళయాగ్నిని బోలిన యామె పరాక్రమము గని యగ్బరత్యాశ్చర్యమును బొందెను. ఆయన జడునివలె నేమియు దోచక నిశ్చేష్టితుడయి నిలువబడెను. అప్పుడా క్షత్రియవీరుల యుత్సాహంబు రెట్టింప, మ్లేచ్ఛసైన్యముల ననేకరీతుల బాధింపదొడగిరి. బాదుషా తనకు జయము కలుగుటకు మారుగా నపజయ మగుటగని చేయునదిలేక సంథిని దెలుపు పతాక మెత్తెను. తక్షణమే ఉదయసింహుని సహితము బంధవిముక్తుని జేసెను. పరాక్రమవంతురాలయిన విరాబాయివలన మహాబలవంతుడైన అక్బరునంతటి తురుష్క ప్రభువు సహితము జయ కాంక్షనుమాని హతశేషులగువారింగొని మరల తనపురి కేగవలసిన వాడాయెను. తదనంతర మా రజపూతులందరును విజయానందముతో సింహనాదములు చేయుచు విరాబాయి ననేకవిధముల గొనియాడుచు విరాబాయితోడను; వుదయసింహుని తోడను పురప్రవేశము చేసిరి. అంతకు బూర్వము తేజోహీనమైన చితూరుపట్టణము రాణిగారి విజయవార్త విని