పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రజపూతు సర్దార్లనేకులు రణరంగమునందు హతులయిరి. రజపూతులెంత దృడనిశ్చయముతో బోరినను తురక సైన్యములు బీరువోకుండుటయు, నానాటికి రజపూతుసైన్యములు పలుచ బడుటయు గని భీమసింహుడు మిగుల చింతాక్రాంతుడయ్యెను. తుదకాతడు ప్రజాక్షయమున కోర్వజాలక డిల్లీశ్వరునితో సంధిసేయనెంచి యందుకై గొందరు మంత్రుల నంపెను. కాని యదిపొసగినదికాదు. సంధి దెల్పవచ్చినవారితో అల్లాఉద్దీను తనకు పద్మిని దొరికినం గాని రణమాగదని స్పష్టముగా దెలిపెను, ఈ వార్త వినగానే శూర రజపూతులందరు పడగ ద్రొక్కిన సర్పముల భంగి అదిరిపడి, తమ యందరి ప్రాణములు పోవు వరకును యుద్ధముజేసెదమని విజృంభించిరి. అందుపై నాయిరు వాగు సైన్యంబులుం దలపడి యుద్ధము చేయుచుండిరి.

ఇట్లు పదునెనిమిది మాసములు యుద్ధము జరుగుచుండెను. కాని శూరులగు రజపూతులు బాదుషా సైనికులను బట్టణములోనికి భొవ నియ్యకుండిరి. అల్లాఉద్దీను వారి నిశ్చయముగని రజపూతుల యుద్ధమునం దోడించి పద్మినిని బట్టు ప్రయత్నము మానుకొనవలసినవాడాయెను. యుద్ధము మానుకొన్నను పద్మినియం దతనికి గల వ్యామోహ మతని నాపొలిమేరదాటి పోనియ్యకుండెను. అందువలన నతడు భీమసింహున కిట్లు వర్తమాన మంపెను. "నాకు పద్మిని దొరుకునన్న యాసలేదు. కాని యామె రూప మొకసారియయినను మీరు నా కగుపరచినయెడల నేను సైన్యసహితముగా డిల్లీకి మరలి వెళ్ళుదును." ఈ వర్తమానము విని కొంతరోషము గలగినను