పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రియైన యనార్యుడు మిహిరుని బుత్రవాత్సల్యముతోబెంచి పెద్దవానిజేసి జ్యోతిషమునం దపార పండితునిగా జేసెనట. తదనంతరమునందు ఖనా మిహిరు లిరువురును యుక్తవయస్కులై తమ పెంపుడుతండ్రుల యనుమతి వడసి వివాహము జేసికొని సంసారభారమును మోయుచుండిరి.

ఖనాయొక్క తల్లిదండ్రులెవ్వరైనది తెలియక పోయినను మిహిరునివంశము మన మెరుగవచ్చును. లోకప్రసిద్ధుడగు విక్రమాదిత్యుని సభయందుండు నవరత్నములలో నొకడగు వరాహున కీమిహిరుడు పుత్రుడట. వరాహుడు జ్యోతిషమునందధిక ప్రవీణుడయి జ్యోతిషగ్రంథములు కొన్ని రచించెను. ఆయనకు మిహిరుడు పుట్టగానే జాతకము వేసిచూచి యందులోసంఖ్యలు తప్పుటవలన, నూరేండ్ల ఆయుర్దాయ మున్నను తండ్రి లెక్కకు బది సంవత్సరములే జీవితమని వచ్చెనట. అందుకు వరాహుడు మిక్కిలి చింతిల్లి పిల్లవాడు పది సంవత్సరములు పెరిగి మృతి నొందిన విశేషదు:ఖమగు గాన, నిప్పుడే వీని నెక్కడనైన విడిచిన బాగుండునని యోచించి, కర్రదోనెలో బాలుని నునిచి నీట ప్రవాహములో విడిచెనట. తదనంతర మాబాలు డొక యనార్యునకు దొరకగా, వాడు సాకి విద్యనేర్పిన సంగతి యిదివరకే వ్రాసినాను.

వివాహానంతరము ఖనా మిహిరులు కిరువురకు ఆర్యులలోనికి వెళ్ళవలయును వాంఛగలిగి, తమపాలనకర్తల యనుజ్ఞ నడిగిరి. అందుకు వారు సమ్మతించి వారినంపి వచ్చుటకయి వెంటనొక యనార్యదాసిని బంపి దానిచేతికి గొన్ని జ్యోతిష