పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథముల నిచ్చిరి. ఆర్యులుండు ప్రాంతముయొక్క పొలిమేరదాటి వారి దేశమునకు వెళ్ళునపుడు, ఆస్త్రీ జ్యోతిషమునందు ఖనాకును మిహిరునకుగల ప్రజ్ఞను బరీక్షింపదొడగెను. వారు జ్యోతిషమునందు పండితులని తెలిసిన నా పుస్తకముల మరల స్వదేశమునకు దీసికొని రమ్మనియు, లేనియెడల పుస్తకములు వారికినిచ్చి రమ్మనియు ననార్యులు చెప్పిరట. కాన వారిని బరీక్షించుటకయి యాదాసి యచట నీనుటకు సిద్ధముగానున్న యొక గోవును మిహిరునకు జూపి 'ఈ యావునకు నెర్రదూడ పుట్టునా, తెల్ల దూడ పుట్టునా' యని యడిగెను. మిహిరుడు 'తెల్లదూడ పుట్టు' నని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట నాయావీనగా నెర్రదూడ పుట్టెను. అందుపై నాదాసి మిహిరునకు జ్యోతిషజ్ఞానము పూర్ణముగా లేదని యెంచి, యా పుస్తకముల నాతనికిచ్చి తన స్వదేశమునకు మరలి పోయెనట. అంత మిహిరుడు తా నిన్ని దినములనుండి శ్రమపడి యభ్యసించిన విద్యయందు తాను ప్రవీణుడు కానందుకు నెంతయు జింతిల్లి, యింత కష్టపడిన రానివిద్య యిక నీ పుస్తకమువలన నేమి రాగలదని కోపముతో నా పుస్తకములను యేటిలో బారవేసెను. అప్పుడు ఖనా సమీపముననే యున్నదిగాన, పరుగెత్తుకొని వెళ్ళి యా పుస్తకములలో రెంటినిమాత్రము నదీ ప్రవాహములోనుండి యీవలికి దీసెను. కడమ పుస్తకము లామెకు దొరకక ప్రవాహములలో కొట్టుకొనిపోయెను. తదనంతరమా దంపతులు తిన్నగా విక్రమాదిత్యుడు వేటకు వచ్చియున్న స్థలమునకు సమీపగ్రామము జేరిరి. అచట విక్రమా