పుట:Abaddhala veta revised.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సన్నిహిత స్నేహితులు ఎథెల్ రేడ్యుగన్ మాత్రమే. ఎథెల్, ధనగోపాల్ ప్రేమ వలన ఎవిలిన్ యిరువుతికీ సన్నిహిత స్నేహితురాలైంది.

ఎథెల్ రేడ్యుగన్ అమెరికన్ ఐరిష్ యువతి. ఆమె కూడా 1915లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ధనగోపాల్ 1914లోనే చరిత్ర ప్రధానాంశంగా గ్రాడ్యుయేట్ అయ్యాడు.

స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డేవిడ్ జోర్డన్ స్టార్ వుండేవారు. ఆయన 1931లో ఛాన్సలర్ గా రిటైర్ అయితే,శాశ్వత గౌరవ ఛాన్సలర్ పదవి యిచ్చారు. జోర్డన్ శాంతి కాముకుడు, సైంటిస్టు. అమెరికాలోని ప్రత్యేక జీవరాశిని ఏరి, అధ్యయనం చేసి రాశారు. ఆయన రచనలు, ఉత్తరాలు, డైరీలు భద్రపరిచారు. ఆయన భార్య చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. రెండో భార్య ఆయనకు మేధా సహచారిణిగా వుండేది. (జెస్సిలూసినైట్) ఆమెను అప్పుడప్పుడు ఎవిలిన్, ఎథెల్ కలుసుకుంటుండేవారు. అలాంటి సందర్భాలలో డేవిడ్ జోర్డన్ స్టార్ ను కూడా కలిశారు. అల్ఫాఫి సొరొరిటి విభాగానికి చెందిన ఎవిలిన్ మేధావిగా రాణించింది.

గ్రాడ్యుయేషన్ ముగించుకొన్న ఎవిలిన్ 1916లో ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. పేదవారి సమస్యలపై వ్యాసాలు రాయాలని, జర్నలిజంలో స్థిరపడాలని ఆమె తలపోసింది. అలాంటి దశలో ఎం.ఎన్.రాయ్ తటస్తపడ్డాడన్నమాట.

రాయ్ తో బాటుగా నిప్పన్ మారో ఓడలో భగవాన్ సింగ్ అనే జాతీయ ఉగ్రవాది ప్రయాణం చేసినట్లు అమెరికా ఎఫ్.బి.ఐ రికార్డు చెబుతుంది.

శాన్ ఫ్రాన్సిస్కో నుండి జూన్ 17 లేదా 28 తేదీలలో (1916) రాయ్ బయలుదేరి, హోటల్ గదీ ఖాళీచేసి, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రాంగణంలో ధనగోపాల్ ముఖర్జీని కలసి వుంటారు. బహుశ కొద్ది రోజులలోనే ఎవిలిన్ తో కూడా పరిచయం అయి వుంటుంది. ఈ ఘట్టాలకు సంబంధించిన తేదీలు, పాత్రలు ఏవీ లేవు. ధనగోపాల్ ముఖర్జీకి సంబంధించిన పత్రాలు పెన్సిల్వేనియా యూనివర్శిటీ, సిరక్యూస్ యూనివర్శిటీలలో వున్నా, రాయ్ ప్రస్తావన ఏదీ లేదు. అతడి రచనలలో కూడా ఎక్కడా రాయ్ సందర్భం రాలేదు. ఎథెల్ రేడ్యుగన్ ఎక్కడైనా ప్రస్తావించినట్లు దాఖలాలు లభించలేదు. అసలు వ్యక్తులు రాయ్-ఎవిలిన్ లు యీ విషయాలు రాయలేదు.

ఎం.ఎన్.రాయ్ ఎవిలిన్ దంపతులు

స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ పాలో ఆల్టో అనే చిన్న ప్రాంతంగా వున్నది. ధనగోపాల్ ముఖర్జీ 1916లో అక్కడే నివసిస్తుండేవాడు. (861 రమోనా, పాలో ఆల్టో, కాలిఫోర్నియా) రాయ్ కూడా దగ్గరలోనే ఒక యింట్లో వుంటుండేవాడు. (245 రమోనావీధి,పాలో ఆల్టో). అయితే రాయ్ వుంటున్న యిల్లు పాలో ఆల్టో పోలీస్ అధిపతి తల్లి నివాసం. ఆ విషయం రాయ్ కు తెలిసి