పుట:Abaddhala veta revised.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండదు. ఆమె పేరు ఎ.ఎఫ్.నోబెల్. రాయ్ ఫలానా వ్యక్తి అని తెలిసిన తరువాత నోబెల్ ను కనుక్కుంటే, రాయ్ కు చాలా ఉత్తరాలు వస్తుండేవనీ, ఇంగ్లండ్ నుండి ఎక్కువగా పోస్టు వచ్చేదని ఆమె చెప్పింది. కొన్నాళ్ళు రాయ్ తో బాటు ఎస్.పి.సర్కార్ అనే జాతీయవాది వున్నాడు కూడా పాలో ఆల్టో ప్రాంతంలోఫ్ క్లీనీంగ్ అండ్ ప్రెస్సింగ్ సంస్థతో రాయ్ సంబంధం పెట్టుకున్నట్లు అమెరికా గూఢాచారి సంస్థ కనుగొన్నది. అది జపాన్ వారి వ్యాపార కేంద్రం. రాయ్ తన పట్టుదల కొనసాగిస్తూ జర్మనీ నుండి ధనసహాయ ప్రయత్నాలు చేశాడు,అది రావడం ఆలశ్యమౌతూనే వుంది.

ఎవిలిన్-రాయ్ లు ప్రేమించుకొని,పెళ్ళి చెసుకుందామనుకున్న తరువాత,ఎవిలిన్ తల్లిదండ్రులను కలిశారు. వారప్పుడు లాస్ ఏంజలస్ నగరంలో వుంటున్నారు. ఎవిలిన్ సోదరి పోవెల్ కూడా అక్కడే వుంటున్నది. ఉద్యోగాన్వేషణ విరమించి, ఎవిలిన్ యూరప్ పాస్ పోర్టు కోసం దరఖాస్తు పెట్టుకున్నది. అవి ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ఒక పట్టాన పాస్ పోర్టు రాదు.కనుక స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ డేవిడ్ జోర్డన్ స్టార్ ను రికమండేషన్ కోరుతూ ఎవిలిన్ జూలై 31(1916)న లాస్ ఏంజలస్ నుండి కోరింది. ఆయన భార్యతో తన పరిచయాన్ని, ఎథెల్ తానూ కలిసి ఆయన యింటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.

జోర్డన్ వెంటనే స్టేట్ డిపార్ట్ మెంట్ కు సిఫారసు లేఖ పంపాడు. ఆ లేఖ చేరక ముందే ఎవిలిన్ పాస్ పోర్టు దరఖాస్తు పంపివేసింది. అయితే జోర్డన్ కు ధన్యవాదాలు జాబు ఆగస్టు 15న (1916) లాస్ ఏంజలస్ నుండే రాసింది.

ఎం.ఎన్.రాయ్,ఎవిలిన్ లు జర్మనీకి యు-53 జలాంతర్గామిలో పోదామనుకున్నారు. కాని ఎవిలిన్ కుటుంబం అందుకు అభ్యంతరపెట్టగా ఆ ప్రయత్నం విరమించారు. ధనగోపాల్ యీ విషయం ఒక సందర్భంలో సి.సి. ఆంథోనికి చెప్పాడు.

ఎవిలిన్ అన్న వాల్టర్ ఎట్యిన్ న్యూయార్క్ లో వ్యాపారం చేస్తున్నాడు. అతడిని కలిసి సహకారం పొందాలని ఎవిలిన్ తలపెట్టి నిస్పృహ చెందింది. ఎవిలిన్ కుటుంబంలో కొందరు ఎం.ఎన్.రాయ్ ను యిష్టపడగా మరికొందరు జాతి,రంగు ద్వేషం తొలగించుకోలేక, వారి పెళ్ళికి విముఖత చూపారు. స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆర్నెల్లు వున్న తరువాత రాయ్-ఎవిలిన్ లు న్యూయార్క్ చేరుకున్నారు. 1917 జనవరి నుండే తమ కార్యకలాపాలు న్యూయార్క్ లో సాగించారు. ఈలోగా బ్రిటిష్ పోలీస్ వత్తిడిపై అమెరికా గూఢాచారులు రాయ్ వెంట,భారత జాతీయవాదుల వెంటబడ్డారు. న్యూయార్క్ లో రాయ్ తరచు నివాసాలు మార్చవలసి వచ్చింది. కొన్నాళ్ళు 136ఇ, 19వ వీథి,న్యూయార్క్ కు మారాడు. ఇంకొన్నాళ్ళు 2116,డాలె ఎవెన్యూ,న్యూయార్క్ లో వున్నాడు. పోలీసులు కనుగొనేలోపు యిలా యిళ్ళు మార్చవలసి వచ్చింది.

మరోవైపు భారత జాతీయ అతివాదులు కొందరు రాయ్ నుండి ఆర్థిక సహాయం