Jump to content

పుట:Abaddhala veta revised.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర్రాంతంలో మేరిడిలోంమెక్లాయిడ్ అనే ఫ్లారిడా రాష్ట్ర యువతిని 1888 జూన్ 5న పెళ్ళి చేసుకున్నాడు. ఆ దంపతులకు 1892లో ఎవిలిన్ పుట్టింది. అప్పటికి గనుల ఇంజనీరుగా ఉటా రాష్టంలోని లేక్ వ్యూ సిటీలో లామార్టిన్ వున్నాడు. ఎవిలిన్ తరువాత పుట్టినవారు చనిపోగా, ఆమె ముద్దులబిడ్డగా పెరిగింది. ఇంట్లో ఆమె చిన్నపిల్ల. మిగిలినవారు ఇనజ్, లేలాదిలోం, హెలెన్, వాల్టర్ ఎడ్విన్, ఫ్లారెన్స్ లు, ఇంజనీరింగ్ కంపెనీ తన పేరిట స్థాపించి, బాగా ఆర్జించిన లామార్టిన్, పిల్లలకు మంచి విద్య చెప్పించాడు. కొన్నాళ్ళ పాటు కంపెనీ అమ్మేసి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తిరిగివచ్చి కాలిఫోర్నియా రాష్ట్రంలో కుదురుకున్నాడు. అందువలన ఎవిలిన్ తల్లిదండ్రులతో బాటు తిరుగుతూ ప్రాథమిక విద్య భిన్న ప్రాంతాల స్కూళ్ళలో పూర్తిచేసింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆబర్న్ లో స్కూలు విద్య అయిన తరువాత, లాస్ ఏంజలస్ లోని స్త్రీల పాలిటెక్నిక్ లో 1908 లో చేరి హైస్కూలు విద్య నేర్పింది. అంతవరకూ ఎవిలిన్ జీవితం సాధారణంగా గడిచింది.

స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అప్పటికి యిప్పటికి అమెరికాలో ప్రతిష్టాత్మక సంస్థే. ఎవిలిన్ అందులో 1911లో ప్రవేశించింది. ఇంకా స్త్రీలకు ఓటుహక్కులేని రోజులివి. పైగా స్త్రీలను సమానంగా కూడా చూడడానికి అంతగా అలవాటు పడని విద్యాసంస్థల వాతావరణంలో ఎవిలిన్ ప్రవేశించింది. ఆమె కంటె ఆమె అన్న ఎడ్విన్ స్టాన్ ఫర్డ్ లో ముందే చేరి చదివాడు. అక్కడ చదవడం పెద్ద గౌరవం.

ఎవిలిన్ స్టాన్ ఫర్డ్ లో ఇంగ్లీషు సాహిత్యం ప్రధాన కోర్సుగానూ,ఫిలాసఫి ఫ్రెంచి అనుబంధ విషయంగానూ స్వీకరించింది. ఎవిలిన్ రెండో సంవత్సరంలోనే తన ప్రతిభను కనబరుస్తూ స్టేజిపై ఇంగ్లీషు నాటకాలలో పాల్గొన్నది. 1913 ఆగస్టు 28న స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ థియేటర్ లో థామస్ ఆగస్టన్ రాసిన ఆన్ ది క్వయట్ అనే హాస్య నాటకంలో ఎథెల్ పాత్ర నిర్వహించింది. ఈ నాటకానికి ముందే బాగా ప్రచారం యిచ్చారు. ఎవిలిన్ తన పాత్రను ఎంతో చక్కగా పోషించినట్లు పత్రికలు రాశాయి. ఈ నాటకం మూడు అంకాలతో కూడిన హాస్యప్రధానం. 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో అమెరికా అత్యుత్తమ నాటికలో ఒకటిగా శ్లాఘించిన "ఆన్ ది క్వయట్" న్యూయార్క్ బ్రాడ్వే ధియేటర్లలో ఒక దశాబ్దం తరచు ప్రదర్శించారు. ఎవిలిన్ ఉచ్ఛారణ, ఉదాత్త అనుదాత్త స్వరం, పాత్ర పోషణ బాగా గుర్తింపు పొందాయి. అలా తన ప్రతిభను చూపిన ఎవిలిన్ 1913-14 లో యూనివర్శిటీ పత్రిక "క్వాడ్"లో సహసంపాదకురాలుగా వున్నది. ముఖ్యంగా ఆటల్లో టెన్నిస్, ఫెన్సింగ్ లో పాల్గొన్నది. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతుండగా ఎవిలిన్ తరచు తల్లికి ఉత్తరాలు రాస్తుండేది. వాటిని బట్టి కొంత సమాచారం లభిస్తున్నది. యూనివర్శిటీలో కొందరు బెంగాల్ వారుండేవారు. వారితో రవీంద్రనాథ్ ఠాగోర్ సాహిత్యం చర్చ చేసినట్లు ఎవిలిన్ పేర్కొన్నది. అలాగే మెక్సికన్ల సమావేశాల వలన వారి అలవాట్లు ఆచారాలు తెలుసుకున్నది. ఉత్తరోత్తర రాయ్ తో బాటుగా మెక్సికో వెళ్ళినప్పుడు అవి తోడ్పడ్డాయి.

యూనివర్శిటీ విద్యార్థినిగా ఎవిలిన్ కు ధనగోపాల్ ముఖర్జీ పరిచయం వున్నప్పటికీ,