పుట:Abaddhala veta revised.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలెత్తింది. ఇది ప్రాంతీయ ప్రభావంతోనే రాజకీయాలలో పాల్గొన్నది. సెక్యులరిజాన్ని అడుగడుగునా వ్యతిరేకించిన రామరాజ్య పరిషత్ ఎన్నికలలో పాల్గొన్నది. ఏనాడూ ఎక్కడా బలం సంపాదించలేని రామరాజ్య పరిషత్ ప్రజల నిరాదరణకు గురైంది. రాజస్తాన్ లో స్థానిక భూస్వాముల ప్రాపకంతో యీ పరిషత్ తలెత్తుకొని వున్నది. కులవృత్తులను వంశపారంపర్యతను సమర్థించే పరిషత్ కాంగ్రెసు తలపెట్టిన సంస్కరణలను నిరసించింది.

1949 ఏప్రిల్ లో ఏర్పడిన రామరాజ్య పరిషత్ 1952 ఎన్నికలలో పాల్గొన్నది. ఉత్తరాది రాష్ట్రాలలో పరిషత్తుకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వామి కారపత్రి, స్వామి స్వరూపానంద సరస్వతి, నందనాల్ శర్మవంటి వారి నాయకత్వం పరిషత్ కు లభించినా, ప్రజల మద్దతు సంపాదించలేకపోయారు. సెక్యులరిజాన్ని పాశ్చాత్య ప్రజాస్వామిక భావాలను పరిషత్ వ్యతిరేకించింది. క్రమేణ ఎన్నికలలో పాల్గొనడం కూడా మానేశారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్.ఎస్.ఎస్.)

1925లో ఆర్.ఎస్.ఎస్. కేవలం కొద్దిమంది మిత్రులతో డా॥ఇశావ్ బలరాం హెడ్గేవర్ ఆధ్వర్యాన ఏర్పడింది. అనాధ బాలుడుగా హెడ్గేవర్ 1916 నుండి కాంగ్రెస్ లో పనిచేశారు. హిందూ-ముస్లిం కలహాలు చూచి, హిందువులు సంఘటితపడాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చి,ఆర్.ఎస్.ఎస్. స్థాపించారు. ఆయనతోపాటే పెరిగిన యీ సంస్థ హెడ్గేవర్ చనిపోయే నాటికి(1940 జూన్ 21) లక్షమంది సభ్యులతో దేశంలో వ్యాపించింది. హిందూ-ముస్లిం కలహాలు సంభవించినపుడు ఆర్.ఎస్.ఎస్.ప్రముఖపాత్ర వహించింది. కలహాలలో గాయపడిన హిందువులకు సేవలు చేసింది. హిందువులలో ముఖ్యంగా సనాతనులలో ముస్లిం వ్యతిరేకత ప్రబలడానికి, హిందూ ఐక్యత కావాలనడానికి ఆర్.ఎస్.ఎస్. తోడ్పడింది.

హెడ్గేవర్ నాయకత్వాన ఆర్.ఎస్.ఎస్. హిందువులను సంఘటితపరచడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నది. ఇదొక సాంస్కృతిక సంస్థ అని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టపరచారు. హిందు సమాజాన్ని మళ్ళీ సజీవంగా పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హిందు యువకులను సమీకరించి,ఉదయమే కసరత్తు చేయడం, హైందవ వీరోచిత ప్రసంగాలు వినిపించడం, స్వచ్ఛంద సేవకులుగా మలచడం వీరి నిత్యకృత్యాలు. రాజకీయంగా తొలుత హిందు మహాసభను బలపరచారు. ఆర్.ఎస్.ఎస్.లో హెడ్గేవర్ అత్యున్నతాధిపతి. ఆయన్ను సర్ సంఘ సంచాలకుడనేవారు.

హెడ్గేవర్ వారసుడుగా ఎం.ఆర్. గోల్వాల్కర్ సర్ సంఘ సంచాలకుడయ్యారు(1940). నాగపూర్ యీ సంస్థ కేంద్రం. వీరి సంస్థల్లో కార్యకలాపాలు రహస్యంగా సాగుతాయి. బహిరంగంగా సంఘ లక్ష్యాలు,ఆశయాలు తొలుత ప్రకటించలేదు. ఎన్నికలు కూడా ప్రజాస్వామికంగా జరిగినట్లు ఆధారాలు లేవు. గోల్వాల్కర్ నాయకత్వాన ఆర్.ఎస్.ఎస్. బాగా