పుట:Abaddhala veta revised.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయకుడుగా ఆవిర్భవించాడు. ముస్లింలుగా మారిన హిందువులను మళ్ళీ శుద్ధిచేసి హిందువులుగా మార్చడానికి వీరు కృషి చేశారు. ముస్లింలలో యిందుకు నిరసన, ప్రతిఘటన వచ్చింది.

కాంగ్రెసు మహాసభలు జరుగుతుండగా 1923లో బెల్గాంవద్ద హిందూ మహాసభ కూడా పెద్ద సమావేశం జరిపింది. ముస్లిం నాయకులతో సహా హిందూ ప్రముఖులు యిందులో పాల్గొని జాతీయోద్యమానికి మద్దతు ప్రకటించారు. హిందూ మహాసభ నాయకుడుగా ఆవిర్భవించిన వీరసావర్కార్ వ్రాసిన "హిందూత్వం" వారికి ప్రమాణ గ్రంథంగా మారింది. హిందువుల సంఘటన ప్రధాన నినాదమైంది. కాంగ్రెస్ కూ హిందూ మహాసభకూ అట్టేకాలం వియ్యం కుదరలేదు. 1930 తరువాత యిరువురూ ఎవరిదారిన వారు పోయారు. ఎన్నికలలో కాంగ్రెస్ కు పోటీగా హిందూ మహాసభ అభ్యర్థులను పెట్టింది. సావర్కార్ కొత్త నిర్వచనం ఇస్తూ, భరతభూమి తనదని భావించే ప్రతివారు హిందువేనని, యీ గడ్డపై పుట్టినవారంతా హిందువులని ప్రవచించాడు. హిందువులలో ముస్లింలు కలియరని, వారిని అనుమానాస్పదంగా చూడాలని సావర్కార్ అన్నారు. హిందూ మహాసభ అధ్యక్షుడుగా వున్న సావర్కార్ తన తీవ్ర ఉపన్యాసాలతో ముస్లింలను యింకా దూరం చేశాడు. హిందువులలో మాత్రం ఆయన అనుకున్నట్లుగా సంఘటన తీసుకరాలేకపోయాడు. హిందూ మహాసభ రాజకీయాలతో ఏనాడూ బలాన్ని పొందలేకపోయింది. సావర్కార్ హిందూ మహాసభ హిందువులు సొంతం చేసుకోలేదు.

హిందూమహాసభ సావర్కార్ నాయకత్వాన కొన్ని సంస్కరణలకు మద్ధత్తు ప్రకటించింది. అందులో హరిజనుల దేవాలయ ప్రవేశం ఒకటి. అంటరానితనం పోవాలన్నది.

స్వాతంత్ర్యం వచ్చాక, హిందూ మహాసభ అఖండ భారత్ నినాదాన్ని చేపట్టినది. పాకిస్తాన్- ఇండియా కలసిపోవాలని కోరారు. ఇందుకు అవసరమైతే యుద్ధం చేస్తామన్నారు. గోవధ నిషేధించాలన్నారు. శుద్ధి ఉద్యమం సాగిపోవాలన్నారు. హిందూ వివాహచట్టం తొలగించాలన్నారు. నిర్భంధ సైనిక శిక్షణ కావాలన్నారు. సావర్కార్ నినాదాన్ని పదేపదే ప్రచారం చేశారు. "రాజకీయాలు హైందవం కావాలి. హిందూమతం సైనిక ధోరణిలో సాగాలి" హిందూ సోషలిజం కావాలని హిందూమహాసభ నినదించింది. సావర్కార్, వి.జి.దేశపాండే, ఎన్.సి.చటర్జీ మొదలైన హిందూ మహాసభ నాయకులు హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించారు. భారతదేశంలో పునర్వికాసాన్ని అడుగడుగునా వీరు అడ్డుకొన్నారు. రాజకీయాలలో,ప్రతి ఎన్నికలలో హిందూ మహాసభ ఓటమిని చూచింది. అయినా వారు తమ ఫాసిస్టు ధోరణి విడనాడలేదు. రాజకీయాలలో నామమంత్రంగా నిలిచిన హిందూ మహాసభ సంస్కరణలకు అడ్డొస్తూ పునర్వికాసాన్ని ముందుకు సాగకుండా చేసింది.

రామరాజ్య పరిషత్

హిందూమహాసభవలెగాక రామరాజ్య పరిషత్ ఇంకా సనాతనంగా భారతదేశంలో