పుట:Aandhrakavula-charitramu.pdf/709

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

682

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వరాహపురాణము

        ఉ. చూచే నృపాలు నెమ్మొగము చూపు సరోజగతాళిసన్నిభం
            బై చరియింపఁ జూచి హృదయ.. రూధివిభేదనార్ధమై
            చూచె నిజార్చితాంగజునిఁ జూపు మహీవిభు నేయనిచ్చు నా
            రాచముకై వడిన్ మెఱయ రాజకుమారిక ఘర్మవారియై, ఆ.3

        చ. అతివిశదప్రభా విలసనాస్పదమైన పదాంగుళీనఖ
            ప్రతతి వెలుంగు నా హిమధరాధరపుత్రికిఁ బద్మ నేత్రకున్
            గతజననంబునం దమకు గాదిలిసోదరి గాన భక్తితో
            సతతముఁ గొల్వ దక్షతనుజాతలు తారలు వచ్చెనోయనన్ ఆ.6

        ఉ. కమ్మని తేనియల్ తఱచు కాలువలై ప్రవహింప మీఁద జుం
            ఝుమ్మని మ్రోయు తుమ్మెదలజొంపము మళ్ళకు నీళ్ళు కట్టుచో
            బమ్మిన వేడ్కఁబాడు వనపాలకబాలకదంబకంబుచం
            దమ్మున నొప్పు నప్పురము నాలుగువంకలఁ బువ్వుతోఁటలన్ ఆ.8

        ఉ. ఆ లలనావతంసముల నమ్మునులం గని జారరానల
            క్ష్వేళభరంబు నేత్రములఁ జీఁకటి గొల్పఁగ నోట లేల యీ
            యాలతు లేటికిం జెవుల నంతకుపల్కులు పోవ నిన్నియుం
            జాలును దుఃఖితే మనసి సర్వ మసహ్యమటం చెఱుంగవే: ఆ 12.

నందిమల్లన్న ఘంటసింగన్న కవులు మదనవేనము, షష్ణస్కంధము, భారతము, బలరామవిజయము చేసిరని యొకరు వ్రాసియున్నారు. మలయమారుత సింగన్న కవుల షష్టములోనిదని శ్రీమానవల్లి రామకృష్ణ కవిగారు కుమారసంభవటిప్పణములో నీ క్రింది పద్యము నుదహరించి యున్నారు...

          సీ వారిధిశయనుఁ జేయారఁబూజింపని
                       ఖలుఁ బట్టి పేడకేలు గట్టి తెండు;
             హరి మందిరమున కత్యాశుడై నడవ
                       విహీనాత్ముఁ గాల్పట్టి యీడ్చి తెండు;వ
             లవదు భయంబు వారెంతవారలైన
                       నట్టివారలు మన కగ్గమైనవారు:
             వారు నిరయం బునకుఁ గాఁపు వచ్చువారలనుచు
                        బుద్దిగఁ జెప్పె మార్తాండసుతుఁడు;