Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

681

నం ది మ ల్ల య్య , ఘం ట సిం గ య్య

        హరణమను కావ్యమొనరించే నంధ్రభాష
        నాదివాకరతారాసుధాకరముగ

మల్లయసింగయకవులలో నెవ్వరీకవిత్వ మేదో యుభయుల రచనలకును గల తారతమ్యమెట్టిదో నిర్ణ యించుక కాధారము లేవియుఁ గానరావు. అక్కడక్కడఁ గొన్ని యపూర్వప్రయోగములు గానంబడుచున్నను మొత్తముమీఁద కవనము రసవంతముగాను, నాతికఠినముగాను, శ్రావ్యముగాను ఉన్నది. కవిత్వరీతి తెలియుటకయి కొన్ని పద్యముల నిండుదాహరించుచున్నాను.

ప్రబోధచంద్రోదయము.

మత్తకోకిల
          ఏను మున్నొకనాఁడు పద్మజునింటి కేఁగినఁ గోల్వులో
          మౌను లెల్లరు లేచి రప్పుడు మమ్ముఁ జూచి పితామహుం
          డానవెట్టి ప్రియంబు చెప్పుచు నందు గోమయమార్జితం
          బైనయట్టి నిజోరుపీఠికయందు నిల్పఁడె నావుడున్ ఆ. 2
మత్తకోకిల
         ఓరి భిక్షుక: చెప్పురా నిను నొక్క శాస్త్రరహస్య మేఁ
         జేరి వేఁడెద నన్న బౌద్ధుడు చిఱ్ఱుముఱ్ఱు మటంచు నో
         రోరీజైనపిశాచ: నగ్నుడ: యోరి దుర్మలభాండ, నీ
         కూర కేటికి శాస్త్రగర్వము లోరి కాఱులు మానురా. ఆ.3

    ఉ. మెత్తని దుప్పటంబులను మెత్తిన కస్తురికప్పురంబులన్
        ముత్తెవుఁబేరులన్ సురభిపూరితపుష్పములన్ వృథా వెలిన్
        హత్తిన వేడ్కఁజూతు రహహా! మతిహీనులు లో నెఱుంగ కీ
        బిత్తరివారనారు లనుపేరిట జంగమనారకంబులన్ ఆ.4

   మ. ధన ముద్యన్నిధనంబు దేహము విపత్సంతానగేహంబు భా.
       మ నితాంతంబు ననర్థసీమ విషయోన్మాదంబు ఖేదంబు గ
       న్గొన లోకంబున శోక మిట్టెఱింగి నూల్కోలేరు ప్రాణుల్కటా!
       యనవద్యాత్మసమేధమానసుఖవథ్యాహృద్యసంచారముల్, ఆ. 5