పుట:Aandhrakavula-charitramu.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

611

బ మ్మె ర పో త రా జు

      
       సీ. తనకుల బ్రాహ్మణు ............. నిత్యసత్యవచను,మత్యమరాధిపా
          చార్యు సుజను నన్నపార్యుఁ జూచి"

అని భారతాదిపర్వములో నన్నయభట్టారకుఁడు తన్నుఁగూర్చి 'నన్నపార్యు'నవి ప్రథమపురుషములోఁ జెప్పుకొనలేదా ?

  “ఎఱ్ఱనార్యుండు ........ ఆరణ్యపర్వశేషము పూరించెఁ గవీంద్ర కర్ణపుట పేయముగాన్” అని భారతారణ్యపర్వాంతమున నెఱ్ఱాప్రెగడ తన్ను గూర్చి “యెఱ్ఱనార్యుఁడు పూరించె" నని ప్రధమపురుషములోఁ జెప్పుకోలేదా ? ఎవ్వరెవ్వరినో చెప్పనేటికి ? బమ్మెరపోతన్ననే చూతము.

  ఉ.ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
     సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
     సమ్మెట వ్రేటులం బడక సమ్మతి (శ్రీహరి కిచ్చి చెప్పె నీ
     బమ్మెరపోతరా జోకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్"

అని భాగవతప్రథమస్కంధములో బమ్మెర పోతనామాత్యుఁడే తన్నుఁ గూర్చి “బమ్మెరపోతరా' జని ప్రథమపురుషములోఁ జెప్పుకోనలేదా ? బమ్మెరపోతరా జని ప్రథమపురుషములోఁ నుడువుటచేత భాగవతము పోతన రచించినది గాక మఱియొకరు చెప్పినదని చెప్పి కంఠోక్తి గాఁ జెప్పఁబడిన దాని నంతను వీరభద్రరావుగారు కొట్టివేయుదురా ?

ఇఁకఁ బండితకీర్తనీయుఁ డన్నదానిలోఁ గలదన్న యాత్మశ్లాఘయు నిటువంటి దుర్బలమైన హేతువే. భోగినీదండకములోని రచన భాగవత రచనమువలెనే పండిత శ్లాఘాపాత్రముగా నుండలేదా ? ఉన్న దానిని జెప్పుకొనుట సత్యమే యగును గానీ యాత్మస్తుతి కానేరదు. ఒక వేళ నిందుఁ గొంచెము స్తుతి యున్నదనుకొన్నను పయి పద్యములో “నిత్యసత్యవచను మత్యమరాథిపాచార్యు" నని నన్నయభట్టు చేసికొన్న దానిలో నిది యెన్నవ పాలు ? "కవీంద్రకర్ణ పుట పేయముగా" నని యెఱ్ఱా ప్రెగడ చెప్పుకొన్న దానీలో నింతమాత్రపు స్తుతి లేదా ? పోతరాజు చెప్పిన పద్యములోనే