Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

612

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము


"శ్రీహరి కిచ్చి చెప్పె నీబమ్మెర పోత రా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్" ననుచోట నించుక యాత్మ స్తుతియు, “ఇమ్మనుజేశ్వరాథముల కిచ్చి" యనుచోట నించుక పరనిందయు, కనఁబడుచుండ లేదా ?

బమ్మెర పోతరాజువంటి భక్తాగ్రేసరుఁడొకరాజుంచుకొన్న వేశ్యనుగూర్చి దండకము చెప్పునా ? యన్నది మూడవ హేతువు ! ఈ దండకము చెప్పు నాటికి పోతన్న భక్తాగ్రేసరుఁడు కాఁడు. చంద్రోపరాగపర్వదినమున గంగా స్నానమునకుఁ బోయినప్పుడు రామభద్రుఁడు స్వప్నములో సాక్షాత్కరించి శ్రీమద్భాగవతమును దెనిఁగింప నియోగించినతరుపోత నీతనివిష్ణుభక్తి, యారంభ మైనది. తోడనే యితఁడు భాగవతరచన కుపక్రమించేను.

పోతన బాల్యమునుండియు విశేషవిత్తవంతుఁడు కాకపోవుటచేతను, సహజ పాండిత్యము గలవాఁ డగుటచేతను, నిరుపమానకవిత్వ నైపుణి గలవాఁడగుటచేతను, రాజాశ్రయమును సంపాదించి తన పాండిత్యమును ప్రకటించి విత్త మార్జించి పేరుపొందవలె నన్నయ పేక్షతో మహావిద్వాంసుఁడని పేరొంది సమీప రాజ్యపదస్థుఁడై యున్న సింగమ నాయని దర్శించుటకయి యౌవనారంభదశలోఁ బోయి యుండును. ఆ ప్రభువు తన ప్రియురాలి పైని దండకమును జెప్పి నీ కవన నైపుణిని జూపు మని నియమించినప్పుడు యువజనస్వాభావికదౌర్బల్యముచేతనో, దాక్షిణ్యముచేతనో పాండిత్య ప్రకట నాభిలాషచేతనో రాజు కోరిక చెల్లించి యుండును.

భోగినీ దండకము పోతనవిరచితము కాదని చెప్పుటయే మనస్సులో నా కిష్ట మయినను భాగవతకవిత్వముతో భోగినీదండకకవిత్వమును బోల్చి చూచినప్పుడు నా మనస్సట్లు వ్రాయుట కొప్పినది కాదు. మొట్టమొదటి భోగినీ దండకమును ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములోఁ జూచినప్పుడు నా కత్యాశ్చర్యము కలిగినది. ఆవఱకెవ్వరై నను పోతన్న భోగినీదండకమును జేసెనని చెప్పుచు వచ్చినప్పుడు నేను వారిని నమ్మక యబద్దమని నిరాకరించుచు వచ్చితిని. దండకమును బ్రత్యక్షముగా జూచినతరువాతను దాని కవిత్వము పోతనదే యని దృఢముగా తోఁచినతరువాతను పరు లాతని