పుట:Aandhrakavula-charitramu.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

534

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

               నృపతిమాత్రుండె నిజపాదనీరజాత
                     ఘటీతకోటీర వైరిభూకాంతమాన
                     సాంతరభయాపహారి శ్రీదంతులూరి
                     గన్న భూపాలమౌళిదోర్గర్వశాలి.

అని యతఁడు శ్రీనాధకవీంద్రునిచే ధనంజయవిజయకావ్యము నందెనని చెప్పెను. అప్పటికి గన్న నరపాలుఁడు ధన్యవాటీపురములోనే యుండెనో తరువాత నాతని సంతతివారు నివాసముగా నేర్పరచుకొన్న కృష్ణా గోదావరీ మధ్యసీమకు వచ్చి యుండెనో తెలియదు.

ఇంతటితోఁ జూడఁ దగిన సంస్థానము లన్నియు నయిపోయినవి. పోయిన సంస్థానమునకే మరలఁ బోయిన కార్యము లేదు. ఇఁక నెక్కడనై నను మహదాశ్రయము సంపాదించి యక్కడ స్థిరపడవలెను. అట్టి యాశ్రయ మేదియా యని విచారింపఁగా నప్పటి కనుకూల మయినది రాజమహేంద్ర వరములో రెడ్ల సంస్థాన మొక్కటి కనఁబడినట్టున్నది.

ఇప్పుడు తన కడపటి యేలిక యైన పెద్దకోమటి వేమనకు గర్భశత్రువుగా నుండిన యల్లాడ రెడ్డి మొదలైనవా రంతరించి వారి పుత్రులు రెడ్డిసంస్థానమునకు ప్రభువు లయిరి. అంతకంటెను ముఖ్యముగా తాతనాటినుండియుఁ దన కుటుంబము నెఱిఁగినవాఁడును, బంధువుఁడునైన బెండపూడి యన్నామాత్యుఁడు రాజమహేంద్ర ప్రభువులైన వేమవీరభద్రారెడ్ల కడ మంత్రిగా నుండుట తటస్థించెను. అందుచే శ్రీనాధుఁడు 1427-28-వ సంవత్సర ప్రాంతమునందు రాజమహేంద్రవరమునకు వచ్చి యన్నయామాత్యు నాశ్రయించి తదనుగ్రహమునకుఁ బాత్రుడయ్యెను. అల్లాడ రెడ్డి 1426 -వ సంవత్సరమువఱకును రాజమహేంద్రరాజ్యపాలనము చేసి యుండుటచేతను, తదనంతరమున రాజ్యభారమును వహించిన వేణువీరభద్రరెడ్ల రాజ్యకాలము లోనే శ్రీనాథుఁడు వారిమంత్రియైన బెండపూడి యన్నామాత్యునికడకు వచ్చుటచేతను, ఆతడు రాజునుహేంద్రవరమునకు వచ్చుట 1427-వ