పుట:Aandhrakavula-charitramu.pdf/560

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

533

శ్రీనాథుఁడు

తరువాత శ్రీనాధుఁడు మైలారురెడ్డి మొదలైన సామంత సంస్థాన ప్రభువును గూడ సందర్శించి యర్హ సంభావనలు పొంది దేశ సంచారము ముగింపవలసిన వాఁడయ్యెను. ఈ సంచారమును ముగింపకముందే శ్రీనాథుఁడు ధాన్యవాటీపురమునకో, దారిలో కృష్ణా గోదావరీ మధ్యాంతర్వేదిసీమకోపోయి యచ్చటి యప్పటి సంస్థానాధిపతియైన దంతులూరి గన్న భూపాలునికడఁ గొంతకాల ముండి యాతనికి ధనంజయవిజయ మంకితము చేసినట్టు కనఁబడుచున్నది. ధనంజయవిజయ మెక్కడను గానరాలేదు గాని యీ విషయము గోదావరి మండలములో నుండిన దంతులూరి బాపనృపాలుని పేరట నూఱు సంవత్సరముల క్రిందట రచియింపఁబడిన మూర్తిత్రయోపాఖ్యానమువలనఁ దెలియవచ్చుచున్నది. బాపరాజు గోదావరీమండలములో నుండినను నాతనివంశ మూలపురుషుడైన హరిసీమకృష్ణుఁడు ధాన్యవాటీపుర ప్రభువయినట్టు మూర్తీ త్రయోపాఖ్యానములోని యీ క్రింది పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

    మ. కురియించెన్ బహుధాన్యవర్ష మఖిలక్షోణీప్రదేశంబునన్
        హారియించెన్ విమతాంధకారములు బాహాగ్రాసిసూర్యప్రభన్
        సిరి మించెన్ నృపవర్యు లెంచ ఘనుఁడై శ్రీధాన్యపోటీపురీ
        చిరసామ్రాజ్యమానమాశ్రయమహాసింహాసనాసీనుఁడై.

ఈ హరిసీమకృష్ణునికులమునందు భీమరాజు జనించెనఁట! ఆ భీమరాజు కొడుకు గన్న నరపతి, ఈ గన్ననరపతిని వర్ణించుచు గ్రంధకర్త

    సీ. అహితదుర్గాధ్యక్షు లందఱు భయ మంద
                              గ్రీడికై వడి నీల్చెఁ దాడినాడ
        నక్షుద్రదానవి ద్యాక్షేత్రములచేతఁ
                              బ్రతి యెవ్వరును లేక ప్రతిభఁ గాంచెఁ
        దనకీర్తి దశ దిగంతరగీయమానమై
                              కనుపట్ట ధర్మమార్గంబు నెఱపె
        శ్రీనాధసుకవీంద్రుచే ధనంజయవిజ
                              యం బను సత్కావ్య మందిదీ వెలసె