Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

532

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ఈ సింగభూపాలుని రాజ్యము రాజమహేంద్ర మండలములోని కొంత భాగము వఱకును కొం తకాలము వ్యాపించినను వ్యాపింపకపోయినను సర్వజ్ఞబిరుద మీతనికిఁగూడ నుండినది. ఈ బిరుదము రెండు విధముల రావచ్చును. ఒకవిధమునఁ దాను స్వసామర్ధ్యముచేత సంపాదించు కొన్నదే ననుకోవచ్చును; డిండిమకవి సార్వభౌములకువలె పూర్వుల నుండి వచ్చినదైనను కావచ్చును. ఎట్లు వచ్చినను పదవతరమువాఁడై న యీ సింగభూపాలుఁడు పాండిత్యప్రభావముచేతను, పండితజనసమాదరణ చేతను, కావ్యప్రియత్వముచేతను సర్వజ్ఞ నామమున కర్హుడయినట్టు కనుపట్టు చున్నాఁడు శ్రీనాధుఁడీ రావు సర్వజ్ఞసింగభూపాలుని యాస్థానమునకుఁ బోయి యుండిన కాలములో

          క. సర్వజ్ఞనామధేయము
             శర్వునకే రావుసింగజనపాలునకే
             యుర్విం జెల్లును నితరుని
             సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.

అని రాజునుగూర్చి చెప్పే ఈ పదం విషయమయి యిటీవలివారొక వింతకథను గల్పించియున్నారు. పెదకోమటి వేమభూపాలుని యాస్థానములో నుండగానే శ్రీనాధుఁడు సింగభూపాలునికడకుఁ బోయి యీ పద్యముచే నాతనిని స్తుతించి మరల స్వస్థానమునకు రాగా, వేమభూపాలుఁ డిట్లు చెప్పితి వేమని యడుగగా, అదిస్తుతి కాదనియు "సర్వజ్ఞ నామ ధేయ మొక్క శర్వున కే కాని సింగభూపాలని కే యుర్వినిజెల్లు ?” నని చేసిన పరిహా సమనీయు, సమాధానము చెప్పి కవి తన ప్రభువును సంతోషపెట్టెనట. వేమభూపాలుని మరణానంతర ముననే శ్రీనాధుఁడు సింగభూపాలుని యాస్థానమునకుఁ బోయినవాఁడగుటచేతఁ దరువాతి ప్రబుద్ధులచే నీ కధ కల్పింపఁ బడుట స్పష్టము. శ్రీనాథుఁడీ పండిత ప్రభువునొద్దకుఁబోయి సమ్మానము బొందినది 1425-వ సంవత్సర ప్రాంతము.