పుట:Aandhrakavula-charitramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29

న న్న య భ ట్టు

20. భీముఁడు- అమ్మరాజవిష్ణువర్షనుని కొడుకును నయిదవ విజయాదిత్యుని తమ్ముఁడును నైన యీ మూఁడవ భీముఁడు విక్రమాదిత్యుని జయించి 926 -27 సంవత్సరములలో *నెనిమిది మాసములు రాజ్యము చేసిన తరువాత, తాళరాజు కొడుకైన యుద్దమల్లుఁ డీతనిని జcపి రాజ్యమును జేకొనెను.

21. యుద్దమల్లుఁడు- -ఈ రెండవ యుద్ధమల్లుఁడు తాళరాజు కొడుకు. ఇతఁడు 927 మొదలుకొని 934 వఱకు నేడు సంవత్సరములు రాజ్యము చేసినతరువాత నాల్గవ విజయాదిత్యుని ద్వితీయపుత్రుఁడై_న చాళుక్య భీమునిచే జయింపఁబడి రాజ్యపదభ్రష్టుఁ డయ్యెను. ఈతని కాలపు బెజవాడ శాసనములో తెలుఁగు పద్యములున్నవి. [(మొదటి) యుద్ధమల్లుఁడు ప్రసిద్ధిగల మల్లపరాజు బెజవాడలోఁ గుమారస్వామికి ఒక ఆలయమును, దానింజేర్చి యొక మఠమును కట్టించెను. ఈ యంశములుగల శాసనమే యుద్ధమల్లుని బెజవాడ శిలా శాసనముగా బ్రసిద్ధము. ఈ (రెండవ) యుద్ధమల్లుఁ డతని మనుమcడు. ఇతఁడు పయి గుడికి ముఖమండపమునో, గోపురమునో కట్టించెను.]

22. చాళుక్యభీమవిష్ణువర్ధనుడు - రెండవ చాళుక్యభీముఁడును నేడవ విష్ణువర్ధనుఁడునైన యితఁడు నాల్గవ విజయాదిత్యుని రెండవ భార్య కొడుకు: అమ్మరాజు విష్ణువర్ధనుని సవతితమ్ముఁడు. ఇతఁడు గండ మహేంద్రుఁడు, రాజమార్తాండుఁడు, అను బిరుదులు గలవాఁడై, చోళరాజైన లోవబిక్కి, రాష్ట్రకూట ప్రభువైన యైదవగోవిందరాజు మొదలైన వారిని జయించి, 934 మొదలు 945 వఱకు పండ్రెండు సంవత్సరములు రాజపాలనము చేసెను.

23. అమ్మరాజవిజయాదిత్యుఁడు- రెండవ యమ్మరాజును నాఱన విజయాదిత్యుఁడును నైన యితఁడు రెండవ చాళుక్యభీముని చిన్నకొడుకు. ఈతని కాలమునందలి యెుక దాన శాసనములో నితcడు శాలివాహనశకము 884 వ సంవత్సరము మార్గశీర్ష బహుళత్రయోదశీ శుక్రవారమునాఁ డనఁగా

[*రెండు నెలలు మాత్రమే రాజ్యమేలెనని కవితరంగిణి.(96)]