Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ఆంధ్ర కవుల చరిత్రము

వేఁగిదేశము యొక్క భాగమును మరల నాక్రమించుకొని, 888 మొదలు 918 వఱకు ముప్పది సంవత్సరములు నేల యేలెను.

15. విజయాదిత్యుఁడు - చాళుక్యభీముని జ్యేష్ట పుత్రుఁడై న యీ నాల్గవ విజయాదిత్యుఁడు కళింగులను జయించి, 918 వ సంవత్సరములో నాఱు మాసములు రాజ్యముచేసి దేహవియోగము నొందెను. ఈతఁడు కొల్లభిగండ విజయాదిత్యుఁడని పిలువఁబడుచుండెసు

16. అమ్మరాజ విష్ణువర్ధనుడు - ఇతఁడు నాల్గవ విజయాదిత్యుని పెద్ద కుమారుఁడు. ఈతఁడు రాజమహేంద్రుఁడన్న బిరుదనామము గలవాఁడు. ఈతని కాలములోనే రాజధాని వేఁగీపురమునుండి రాజమహేంద్రవరమునకు మార్పఁబడెననియు, ఈతని పేరనే యా పట్టణమున కాపేరు కలిగినదనియు చెప్పదురు. ఆఱవ విష్ణువర్ధనుఁడైన యీ యమ్మరాజు 918 మొదలు 925 వఱకు నేడేండ్లు భూపరిపాలనము చేసెను.

17. విజయాదిత్యుఁడు - ఈ యైదవ విజయాదిత్యునికి బేటరాజని నామాంతరము గలదు. ఇతఁ డమ్మరాజుయొక్క. జ్యేష్టపుత్రుఁడు. 925 వ సంవత్స రములో పదునేను దినములు రాజ్యము చేసిన తరువాత నీతనిని యుద్దమల్లుని కొడుకైన ♦[1] తాళరాజు రాజ్యపదభ్రష్ణుని జేసి చెఱసాలయందుఁబెట్టి రాజ్యమును గైకొనెను

18. తాళరాజు - యుద్ధమల్లుని కొడుకై న యీ తాళరాజు రాజ్యమాక్రమించుకొని 925 వ సంవత్సరములో నెల దినములు రాజ్యపాలనము చేసిన తరువాత చాళుక్యభీముని ద్వితీయపుత్రుఁడును నాల్గవ విజయాదిత్యుని యనుజుఁడు నైన విక్రమాదిత్యుఁ డీతనిని జంపి రాజ్యమును గైకొనెను.

19. విక్రమాదిత్యుఁడు- చాళుక్యభీమునికొడుకై_న యీ రెండవ విక్రమాదిత్యుఁడు వేఁగి త్రికళింగ దేశములను 925-26 సంవత్సరములలో పదునొక్క మాసములు పాలించినతరువాత ఆమ్మరాజ విష్ణువర్ధనుని కొడుకగు భీముఁ డీతనిని సింహాసనవిహీనుని జేసి రాజ్యముఁ గై కొనెను.

  1. [♦ ఈతనికే తాళపుఁడు, తాడపుఁడు నను నామాంతరములు గలవని 'ఆంధ్ర కవితరంగిణి' (పుట 95)]