పుట:Aandhrakavula-charitramu.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

530

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రసార్ణవసుధాకరము మూఁ డుల్లాసములను గండి; చమత్కారచంద్రిక యెనిమిది విలాసములను గలది. చమత్కారచంద్రికలోని రెండు శ్లోకముల నిందుదాహరించుచున్నాను.

     శ్లో. కృతి రభిమతకృతిచతురా యది చతురోదాంతనయగుణోదారా,
         ఇతి లక్షణ కృతిరత్నం రచయే సింగనృపగుణోదాహరణం.

     శ్లో. లోకే రాఘవపాండవాద్భుతకధాగ్రంథానుసంథాయినౌ
         తౌ గ్రంథా వివ తన్ముని ప్రణీహితౌ శ్రీసింగభూపాశ్రయః
         యాయా దాదరణీయతాం కృతధియాం గ్రంథో౽య మస్మత్కృతీ
         నాహం యద్యపి తాదృ శోస్మ్యయ మసౌ రాజా హి తాదృగ్గుణ8.

చమత్కారచంద్రిక సింగభూపాలకృతము గాక యన్యకృత మయినందున పయి సీసపద్యములోని మూడవ చరణమునందలి 'రచియించె నను దానిని గృతి నందెనని మార్చిన పక్షమున సింగభూపాలుని కది సరిపోవును. విల్సన్ దొరగారు తమ పుస్తకవివరణపట్టికలో 21 వ సంఖ్య గల యా చమత్కారచంద్రికనుగూర్చి “విశ్వేశ్వరకవిచే రాజమహేంద్రవరముజిల్లా లోని పిఠాపురపుజమీదారీయొక్క చిన్న రాజైన సింహభూపాలునియొక్క పద్య స్తవరూపచరిత్రము 16-వ సంఖ్య చూడుము.(A poetical and panegyrical account of Sinha Bhupala, a petty Raja of the Zamindari of Pithapur, in the Rajahmundry district, by Visweswara Kavi. See No.10 ' ఆని వ్రాసి యున్నారు 16 -వ సంఖ్యగల ప్రసంగరత్నావళినిగూర్చి చెప్పుచు దానిలో “77-వ ప్రకరణము విక్రమాదిత్యుఁడు మొదలుకొని మొట్టమొదట కనకగిరిలో చిన్న రాజయి యుండి తన యధికారమును రాజమహేంద్రమండలములోని యొక భాగము పైకి వ్యాపింపఁజేసి పిఠాపురమునో, పెద్దాపురమునో తన రాజధానిని జేసికొన్న సింహభూపుఁడనెడు సర్వజ్ఞసింహనాయఁడు వఱకునుగల ప్రసిద్దరాజులయొక్క సంక్షిప్తచరిత్రములను కలిగి యున్నది. (The 77th chapter contains short accounts of celebrated Princes from Vikramaditya to Sinha Bhupah or sarvajna Sinha Nayudu a petty prince orinally at Kanaka